English | Telugu

నవ్యను పెళ్లిచేసుకోబోతున్న యాంకర్ ప్రదీప్!

సిల్వర్ స్క్రీన్ మీద ప్రభాస్ పెళ్లి విషయం ఒక హాట్ టాపిక్ ఐతే స్మాల్ స్క్రీన్ మీద యాంకర్ ప్రదీప్ పెళ్లి విషయం అంతే హాట్ టాపిక్. ఏ షోలో ఐనా ప్రదీప్ పెళ్ళెప్పుడు అనే ప్రశ్న వినబడుతూనే ఉంటుంది. టాలీవుడ్ లో టాప్ మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కి మంచి పేరుంది. తన యాంకరింగ్ తో ఎన్నో షోస్ సక్సెస్ సాధించాయి..ప్రదీప్ హీరోగా `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే మూవీ కూడా చేసాడు.. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అబ్బాయిగారు పెళ్ళికి రెడీ ఐనట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా ప్రదీప్ పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

ప్రదీప్ న్యూస్ ఉంటే మంచి రేటింగ్ కూడా వచ్చేస్తోంది. అంత హాట్ టాపిక్ గా మారింది ప్రదీప్ పెళ్లి. ఇక ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతు. కొంత కాలం నుంచి న‌వ్య‌తో ప్ర‌దీప్ సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడుపుతున్నాడని ఫైనల్ గా ఈ విషయం అటువాళ్ళు, ఇటువాళ్ళు తెలుసుకుని వీళ్ళ పెళ్ళికి ఒప్పుకుని ముహూర్తాలు పెట్టడానికి రెడీ అయ్యారట . అలా కొత్త సంవత్సరంలో ప్రదీప్ కొత్త పెళ్ళికొడుకు కాబోతున్నాడట ప్రదీప్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.