English | Telugu
బిగ్ బాస్ లోని రతిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అతడేనా?
Updated : Sep 8, 2023
బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. రోజుకో టాస్క్ తో ఈ సారి ఉల్టా పల్టా మరింత కిక్కుస్తుంది. కాగా నిన్నటి టాస్క్ లో ఒక్కో కంటెస్టెంట్ క ఒక్కో రకంగా తమ ట్యాలెంట్ తో మెప్పించారు. కాగా శివాజీ యాక్టింగ్ తో మెప్పించాడు. ప్రిన్స్ యవార్ లేడీ గెటప్ తో ఎంటర్టైన్మెంట్ చేశాడు. మరొక వైపు స్టెతస్కోప్ తో అందరి హార్ట్ బీట్ విని వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పమని రతికకి బిగ్ బాస్ చెప్పగా రతిక ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి హార్ట్ బీట్ చూస్తుంది.
పల్లవి ప్రశాంత్ దగ్గరికి రతిక వెళ్లి హార్ట్ బీట్ చూస్తూ.. నా గుండె ఏం అంటుందని అడగగా రతిక రతిక అంటుందని పల్లవి ప్రశాంత్ చెప్తాడు. ఆ తర్వాత శోభా శెట్టి దగ్గరికి వెళ్లి హార్ట్ బీట్ చుసి నీ హార్ట్ నువ్వు సెక్సీ గా ఉన్నావని అంటుందని శోభశెట్టికీ రతిక చెప్తుంది. కాసేపటికి షకీలని బిగ్ బాస్ కాన్ఫెషన్ రూమ్ కి పిలిచి హాట్ గోసిప్ చెప్పండని అనగానే ప్రశాంత్, రతిక ఇద్దరు క్లోజ్ గా ఉన్నట్లు చెప్తుంది. ఆ తర్వాత టేస్టీ తేజని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి బిగ్ బాస్ హాట్ గాసిప్ చెప్పమని అడుగుతాడు. శుభశ్రీకి గౌతమ్ కృష్ణ బాగా కనెక్ట్ అయ్యాడని, పల్లవి ప్రశాంత్, రతిక కూడా క్లోజ్ అయ్యారని షకీల చెప్తుంది.
ఆ తర్వాత బిగ్ బాస్ రతికని ఆక్టివిటి రూమ్ కి పిలిచి మీకు ఎలాంటి అబ్బయి అంటే ఇష్టమని అడుగుతాడు. ఇన్నోసెంట్ గా ఉండాలి. పాటల మీద ఇంట్రస్ట్ ఉండాలి అని రతిక చెప్తుంది. మీరు ఎవరినైనా మిస్ అవుతున్నారా అని రతికని బిగ్ బాస్ అడుగగా.. ఎవరైనా అమ్మ నాన్నలని మిస్ అవుతారు వాళ్ళ దగ్గర ఉంటే ఇష్టమైన అతన్ని మిస్ అవుతారు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని మిస్ అవుతున్న అని ఒక బ్రేస్ లైట్ పట్టుకొని ఎమోషనల్ అవుతుంది రతిక. అయితే రతిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ అనే విషయం తెలిసిందే.