English | Telugu

స్టాండప్ కమెడియన్ కాస్త మోడల్ గా...బిగ్ బాస్ కంటెస్టెంట్ లో లవ్ బ్రేకప్

పటాస్ ప్రియా అంటే తెలుగు ఆడియన్స్ పెద్దగా పరిచయం లేదు కానీ రతిక రోజ్ అంటే చాలు బిగ్ బాస్ సీజన్ 7 లో అలరిస్తున్న అమ్మాయి అంటే అందరికీ అర్థమైపోతుంది. 2016లో ఈటీవీ ప్లస్‌లో ప్రసారమైన ‘పటాస్’ అనే స్టాండప్ కామెడీ షోలో ఒక స్టాండప్ కామెడియన్‌గా ఆడియన్స్ నవ్వించేది ప్రియా. అలా ఒక ఏడాది ఈ షోలో కనిపించింది.

ఆ తర్వాత తను షోలో కనిపించడం మానేసింది. తర్వాత రతిక రోజ్ గా పేరు మార్చుకుని మళ్లీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మోడల్‌గా బిజీ అయిపోయింది. ఈ టైంలోనే ఆమె మూవీ ఛాన్సెస్ కూడా వచ్చాయి. షకలక శంకర్ నటించిన "బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది" చిత్రంలో రతిక ఓ పాత్రలో నటించింది. కానీ ఈ మూవీ ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయింది. రీసెంట్ గా వచ్చిన బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన "నేను స్టూడెంట్ సర్" మూవీలో నటించింది రతిక. ఈమె ఈ మూవీలో గ్లామర్ పోలీస్ గా కనిపించడంతో ఆ పాత్ర ఆమెకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఇక రతిక లవ్ బ్రేకప్ గురించి రీసెంట్ ఎపిసోడ్ బిగ్ బాస్ రివీల్ చేసేసాడు. ఇక ఈ భామకు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

రతికకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 133 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తమిళంలో కూడా రతిక అవకాశాలు అందుకుంటోంది. ‘మారో’ అనే తమిళ డెబ్యూలో నటించింది రతిక. ఐతే ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు రిలీజ్ ఐన మూవీస్ కూడా రతికాకు పెద్ద పేరు తెచ్చిపెట్టింది కూడా లేదు. కానీ ఆమె పోస్ట్ చేసే ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు మాత్రం ఫాలోవర్స్‌ను బాగా తెచ్చిపెట్టాయి. ఐతే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ రోజున " అసలు బిగ్ బాస్‌లోకి ఎందుకు వచ్చావు" అని నాగార్జున అడగడంతో "ఎన్నో మూవీస్ లో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్‌ ద్వారా వస్తుందని భావించి వచ్చాను" అని చెప్పింది. నిజంగానే ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ ద్వారా రతిక ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించేసుకుంది.