English | Telugu

బిగ్ బాస్-7 నుండి ఎలిమినేట్ అయిన రతిక అలియాస్ రాధిక!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ట్విస్ట్ లతో ఆకట్టుకుంటుంది. హౌజ్ లో ఇప్పటికే మూడు వారాలలో ముగ్గరు ఎలిమినేట్ అవ్వగా, నాల్గవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి నెలకొంది.

నామినేషన్లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా, ప్రిన్స్ యావర్ కి ఓట్ల వర్షం కురిసింది. మొదటి స్థానంలో ప్రిన్స్ యావర్, రెండవ స్దానం లో శుభశ్రీ ఉండగా చివరి రెండు స్థానాలలో రతిక, టేస్టీ తేజ ఉన్నారు. అయితే గురువారం వరకు ఓటింగ్ లో చివరి స్థానంలో టేస్టీ తేజ, చివరి నుండి రెండవ స్థానంలో రతిక ఉన్నారు. హౌజ్ లో అక్కడివి ఇక్కడ చెప్పుకుంటూ కంటెంట్ కోసం ఎంతకైనా దిగజారుతుందంటూ, రతిక అలియాస్ రాధికని ఎలిమినేట్ చేయాలని ప్రేక్షకులంతా ఏకమై.. ఓట్లని టేస్టి తేజకి వేశారు. గురువారం వరకు 2% ఓట్లతో టేస్టీ తేజ, 3% ఓట్లతో రతిక ఉండగా.. శుక్రవారం నాటికి 6% ఓట్లతో టేస్టీ తేజ డేంజర్ జోన్ నుండి బయట పడ్డాడు. ఇక రతిక చివరి స్థానానికి చేరుకుంది.

పల్లవి ప్రశాంత్ ని చీప్ గా చూస్తూ కావాలని, కంటెంట్ ఇవ్వాలని రతిక చేస్తుందనే భావన ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారని సోషల్ మీడియాలో ఇప్పటికే లీక్ అయింది. ఇప్పటికే ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. ఈ వారం రతిక ఎలిమినేట్ అని సన్నిహిత వర్గాల నుండి సమాచారం. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రతిక ఎలిమినేట్ అయింది, ఇక పల్లవి ప్రశాంత్ తన గేమ్ ‌తను ఆడతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే రతిక ఎలిమినేషన్ అనేది ఎవరు ఊహించలేదు. కారణం టేస్టీ తేజ లీస్ట్ లో ఉండటమే. ఇక నిన్న మొన్నటి వరకు డబుల్ ఎలిమినేషన్ అన్నారు.‌ ఇక ఇప్పుడు సింగిల్ ఎలిమినేషన్ అని తెలిసిపోయింది. సింగిల్ ఎలిమినేషన్ గా రతిక బయటకొచ్చేసినట్టు ప్రస్తుతం నెట్టింట న్యూస్ వైరల్ అవుతుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.