English | Telugu

బిగ్ బాస్ ప్రోమో: నాగార్జున చేతిలో బెల్ట్.. అసలు ఏం జరిగింది!


బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని నాల్గవ వారం ముగింపుకి వచ్చేసింది. ఇక వీకెండ్ లో శనివారం రోజు వచ్చే ప్రోమో కోసం ఎంతో మంది చూశారు. హోస్ట్ నాగార్జున ఎవరికి క్లాస్ పీకుతాడు, ఎవరి మీద ఫైర్ అవుతాడనేదాని కోసం ఇప్పటికే బిగ్ బాస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రేక్షకులు ‌ఆసక్తరంగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడ అనే శనివారం ప్రోమో రానే వచ్చింది.

ఇక టాస్క్ లో గౌతమ్ కృష్ణని టార్చర్ చేసినందుకు గాను టేస్టీ తేజ మీద ఫైర్ అయ్యాడు నాగార్జున. సంఛాలక్ గా యూ కంప్లీట్లీ ఫెయిల్ సందీప్‌ని అనగానే సందీప్ మొహం వాడిపోయింది. ఇక టేస్టీ తేజని అలా ఎలా లాగుతావంటూ.. నువ్వు చేసింది తప్పేనా అని నాగార్జున అడుగగా.. రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది అంటూనే అవును సర్ అని తన తప్పును ఓప్పుకున్నాడు తేజ. అంతే కాకుండా మీరు నాకు ఏ శిక్ష వేసిన ఒకే సర్ అని టేస్టీ తేజ అన్నాడు. ఇక టేస్టీ తేజని ఏం చేద్దామని ఇక టేస్టీ తేజకి ఏ శిక్ష వేద్దామని కంటెస్టెంట్స్ ని అడుగగా.. జైలుకి పంపించాలని శుభశ్రీ, ప్రియాంక జైన్ అన్నారు. సందీప్ ని అడుగగా.. డైరెక్ట్ గా హౌజ్ లో నుండి బయటకు పంపించేద్దామని అనగానే‌ బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్స్ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు.

టాస్క్ లో టేస్టీ తేజ అలా చేస్తుంటే నువ్వు ఎందుకు చెప్పలేదని శివాజీని నాగార్జున అడిగాడు. నేను చూడలేదని శివాజీ అన్నాడు. ఇక ఒక్కొక్కరి ఆటతీరుని, మాటతీరుని చెప్తూ కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యాడు నాగార్జున.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.