English | Telugu

రానా 'నెం.1 యారి' సీజ‌న్ 3తో వ‌చ్చేస్తున్నాడు!

ఓ ప‌క్క క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూనే హీరో ద‌గ్గుబాటి రానా గేమ్ షోల‌తో అద‌ర‌గొడుతున్న విష‌యం తెలిసిందే. స్టార్ మా, జీ తెలుగు చాన‌ళ్లు విభిన్న‌మైన షోల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంటే.. జెమినీ టెలివిజ‌న్ కోసం రానా 'నెం.1 యారీ' అంటూ కొత్త షోతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు, విశేషంగా ఆక‌ట్టుకున్నారు. రియ‌ల్ ఫ్రెండ్షిప్ స్టోరీస్‌తో స్టార్ట్ అయిన ఈ షో సీజ‌న్ వ‌న్ క్రేజీ క్రేజీ సెల‌బ్రిటీ ఫ్రెండ్స్ ముచ్చ‌ట్ల‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది.

ఇక సీజ‌న్ 2లో నోస్టాల్జియాతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సీజ‌న్‌లో తిరిగి రానా త‌న స్కూల్ డేస్‌కి వెళ్లిపోయాడు. త‌న‌తో పాటే అంద‌రినీ త‌న స్కూల్ డేస్‌కి తీసుకెళ్లాడు. రానా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అంతా ఒక్కొక్క‌రుగా హాజ‌రై సీజ‌న్ 2ని మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేశారు. రానాతో క‌లిసి అంతా చిన్ననాటి సంగుతుల్ని గుర్తు చేసుకున్నారు. అల్ల‌రి చేశారు.

అయితే ఇప్పుడు 'నెం.1 యారీ' సీజ‌న్ 3 వ‌చ్చేస్తోంది. ఇందులో కొత్త‌గా యారి క్ల‌బ్‌ని స‌ద్ధం చేస్తున్నాడట రానా. లైఫ్ మీద కొత్త అప్రోచ్‌తో, ఫ్రెండ్షిప్ మీద కొత్త ప‌ర్‌స్పెక్టివ్‌తో "వీ ఆర్ బ్యాక్" అంటూ స‌రికొత్త సీజ‌న్‌కి శ్రీ‌కారం చుడుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని సోమ‌వారం విడుద‌ల చేశారు. ఇది ప్ర‌స్తుతం నెట్టింట‌ సంద‌డి చేస్తోంది. ఈ నెల 14 నుంచి ఈ కొత్త సీజన్ ఎప్ప‌టిలాగే శ‌నివారం రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న‌ది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.