Read more!

English | Telugu

రెడ్ హాట్ మిర్చి శారీలో శేఖర్‌తో కలిసి స్టెప్పులేసిన‌ రమ్యకృష్ణ!

'డాన్స్ ఐకాన్' స్టార్ట్ చేసీ చేయగానే మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పుడు షోస్ అన్ని కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ఈ డాన్స్ ఐకాన్ కూడా ఆహా ఓటిటిలో వస్తోంది. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. ఇందులోకి ఎంతో మంది సెలెబ్స్ ఎంట్రీ ఇచ్చారు. 

ఇక ఈ షో కాన్సెప్ట్ ని చాలా కొత్తగా పెట్టడంతో, అందులోనూ ఎప్పుడూ చూడని కొత్త కొత్త డాన్స్ స్టైల్స్ ని ఇక్కడ పరిచయం చేయడంతో ఆడియన్స్ కి ఈ షో బాగా కనెక్ట్ అయ్యింది.

లేటెస్ట్ ప్రోమోలో రెడ్ హాట్ మిర్చి శారీలో రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ కలిసి ఈ స్టేజిపై స్టెప్పులేసి సందడి చేశారు. అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ 'అల వైకుంఠపురంలో'లోని "నీ కాళ్ళను పట్టుకుని" సాంగ్ కి శేఖర్ మాస్టర్ డాన్స్ చేస్తే, రమ్య కృష్ణ లైట్ స్టెప్స్ వేశారు. రమ్యకృష్ణ ఇప్పుడున్న కొత్త కొత్త తారలకు పోటీగా మారారు. శేఖర్ మాస్టర్ గతంలో ఎంతోమంది బిగ్ స్టార్స్ తో కలిసి స్టేజి మీద స్టెప్పులేయించారు. ఇప్పుడు రమ్యకృష్ణతో కూడా డాన్స్ చేయించారు.