English | Telugu

'నేనేదైనా త‌ప్పుచేసుంటే సారీ ఇమ్మూ'.. ఎమోష‌న‌ల్ అయిన వ‌ర్ష‌!

జబర్దస్త్ స్టేజి ఎంతో మందిని కలిపింది. ఆ షో ద్వారా పాపుల‌ర్ అయిన రీల్ లైఫ్ జోడీస్ చాలా మంది ఉన్నారు. ఇలాంటి జోడీస్ లో సుధీర్-రష్మీ ఒక సంచ‌ల‌నం అయితే, ఇమ్ము-వర్ష జోడి ఇంకో సంచ‌ల‌నం. కెవ్వు కార్తీక్ టీమ్ లో చేసేటప్పుడు ఇమ్మూతో లవ్ ట్రాక్ నడిపింది వ‌ర్ష‌. ప్రస్తుతం బులెట్ భాస్కర్ టీమ్ లో వర్ష స్కిట్స్ చేస్తోంది.

ఐతే ఈ మధ్య కొన్ని నెలలుగా ఇమ్ము, వర్ష జోడీగా పెర్ఫార్మ్ చేయడం లేదు.వీళ్ళ కెమిస్ట్రీ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఏమైంద‌నే ప్ర‌చారం ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఇమ్ము మీద ఒకసారి వర్ష ఫుల్ ఫైర్ అయ్యింది. ఐతే ఆ టైంలో ఆది, రాంప్రసాద్ వర్ష ని కూల్ చేశారు కానీ ఆ ఎపిసోడ్ ఏమిటో అలా పూర్తయ్యింది.

ఐతే ఇటీవల లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమోలో వర్ష చాలా బాధపడుతూ కనిపించింది. ఈ న్యూ ఎపిసోడ్ లో "అమ్మ నా కోడలా" పేరుతో స్పెషల్‌ ఎపిసోడ్‌ చేశారు. ఇందులో తమ మనసులో ఉన్న బాధని బయటపెట్టమని చెబుతుంది రష్మి. ఒక్కొక్కరు వచ్చి తమ బాధలను చెప్పారు. వ‌ర్ష‌,"ఓ మూడు నాలుగు నెలల నుంచి మేం సరిగా మాట్లాడుకోవట్లేదు. నేను ఏదన్నా తప్పు చేసుకుంటే ఐ యామ్ సారీ" అని చెప్పింది.

ఆమె మాట‌ల‌కు ఇమ్ము చాలా ఎలా స్పందించాలో తెలీన‌ట్లు సైలెంట్‌ గా ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.