Read more!

English | Telugu

కళ్యాణ్ తీసిన ఆ సెల్ఫీతో రాహుల్ గుట్టు స్వప్నకి తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -104 లో.. ఇందిరాదేవి బయట కూర్చుని అరుంధతితో మాట్లాడి లోపలికి వస్తుంది. ఒక శుభవార్త ఉందని చెప్తూ.. అరుంధతి కూతురిని ఈ ఇంట్లో ఒకరికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటుందని ఇందిరాదేవి అనగానే.. ఎవరికని ఎక్సయిట్ మెంట్ తో అడుగుతుంది రుద్రాణి. ఇంకెవరికి నీ కొడుకు రాహుల్ కి ఇద్దామని అనుకుంటుందని ఇందిరాదేవి అంటుంది. ఇలాంటి ఉమ్మడి కుటుంబంలోకి నా కూతురు కోడలిగా వస్తే హ్యాపీగా ఉంటుంది. నా ఫ్రెండ్ ఇంటికి కాబట్టి నేను ఏ భయం లేకుండా ఉండొచ్చని అరుంధతి అంటుంది.

మరొకవైపు రాహుల్ కి స్వప్న ఫోన్ చేస్తుంది. అది చూసి రాహుల్ ఫోన్ కట్ చేస్తాడు. అలా చాలాసార్లు స్వప్న కాల్ చేస్తుంది. అన్నిసార్లు కాల్ చేస్తున్నారు.. వెళ్లి మాట్లాడు రాహుల్ అని అరుంధతి అంటుంది. ఆ తర్వాత బయటకు వెళ్లి స్వప్నతో మాట్లాడుతాడు రాహుల్. నాకు పెళ్లి సంబంధం కుదుర్చారని స్వప్న అనగానే.. రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ.. నాకు కావలసింది కూడా అదే కదా అని రాహుల్ తనలో తాను అనుకుంటాడు. నువ్వయినా సంతోషంగా ఉండు స్వప్న.. మన విషయం ఇంట్లో తెలిసి ఇంట్లో వాళ్ళు నన్ను శత్రువులాగా చూస్తున్నారు.. ఇంట్లో నుండి గెంటేసేలా ఉన్నారు.. నేను నీ జ్ఞాపకాలతో బతికేస్తానని చెప్పి రాహుల్ ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రాహుల్ వచ్చి వెన్నెలతో మాట్లాడుతాడు. కావ్య రాహుల్ ని అలా మాట్లాడం చూసి వాళ్ళతో ఒక  సెల్ఫీ తీసుకో అని కళ్యాణ్ తో చెప్పగానే.. కళ్యాణ్ వెళ్లి రాహుల్, వెన్నెలతో సెల్ఫీ తీసుకుంటాడు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో కాబోయే భార్యభర్తలకు కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చెయ్యమని కావ్య చెప్పగానే.. కళ్యాణ్ పోస్ట్ చేస్తాడు.

మరొకవైపు స్వప్నని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అబ్బాయి అరుణ్ తో కనకం పెళ్లి గురించి మాట్లాడుతుంది. మరొకవైపు ధాన్యలక్ష్మి తనతో  మాట్లాడడం లేదని రాజ్ బాధపడుతాడు. పిన్ని నాతో మాట్లాడవా? ఇంత కఠినంగా ఎందుకు ఉన్నావని ధాన్యలక్ష్మిని అడుగుతాడు రాజ్. నువ్వు కావ్య విషయంలో ఎంత కఠినంగా ఉన్నావ్? నువ్వు కావ్యని క్షమిస్తేనే.. నేను నిన్ను క్షేమిస్తానని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు స్వప్న దగ్గరికి కనకం వచ్చి.. ఏది ఏమైనా ఆ అబ్బాయితోనే నీ పెళ్ళని చెప్పేసి వెళ్తుంది. ఆ తర్వాత ఎప్పటిలాగే కావ్య, రాజ్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు గొడవపడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.