English | Telugu

త్వరలో ఢీ షోలోకి పూర్ణ

"శ్రీమహాలక్ష్మి" మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ చేసినవి తక్కువ సినిమాలే ఐనా మంచి పేరు సంపాదించుకుంది... షమ్నా ఖాసీం అనే అసలు పేరు కంటే స్క్రీన్ నేమ్ పూర్ణతోనే ఫుల్ ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం పూర్ణ తన మ్యారేజ్ లైఫ్ ని మదర్ హుడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. తన బిడ్డ హమ్దాన్ రాకతో తన జీవితంలో సంతోషాలు విరబూసాయని చెప్పింది పూర్ణ..కొన్నాళ్ల బ్రేక్ తర్వాత ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా మళ్ళీ ఫాన్స్ ని, ఆడియన్స్ ని పలకరించడం స్టార్ట్ చేసింది. "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" పేరుతో అందరి ముందుకు వచ్చింది.

అలా ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పింది.." మిమ్మల్ని ఢీ షోలో చాలా మిస్సవుతున్నాం...మళ్ళీ టీవీ షోస్ లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం" అని అడిగిన ప్రశ్న "కమింగ్ సూన్" అని ఆన్సర్ ఇచ్చింది. "నార్మల్ డెలివరీనా..సి సెక్షనా" అని అడిగేసరికి " దేవుడి దయ వలన నార్మల్ డెలివరీ" అని ఆన్సర్ చేసింది. "మిమ్మల్ని మళ్ళీ పొట్టి జుట్టులో ఎప్పుడు చూడొచ్చు ..అందులో మీరు అందంగా ఉంటారు" అనేసరికి " నా ఫేవరేట్" అని చెప్పింది. "లవ్ మేరేజా అరేంజ్డ్ మేరేజా" అని అడిగేసరికి "లవ్ కం అరేంజ్డ్" అంది..పూర్ణ తమిళ, కన్నడ మూవీస్ లో నటించారు. తెలుగులో ఆమె నటించిన ‘సీమ టపాకాయ్’, ‘అవును’ మూవీస్ మంచి గుర్తింపును తెచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సపోర్టింగ్ రోల్స్ లోనే ఆమె ఎక్కువగా నటించింది. రీసెంట్ గా ‘అఖండ’, ‘తీస్ మార్ ఖాన్’, ‘దసరా’ వంటి మూవీస్ లో కనిపించి అలరించారు. ఐతే త్వరలో ఢీ షోలోకి మళ్ళీ పూర్ణ రాబోతోంది అనే విషయం ఆమె ఇచ్చిన ఆన్సర్ ద్వారా అర్ధమవుతోంది. పూర్ణ జడ్జిగా వస్తే కంటెస్టెంట్స్ కి మళ్ళీ ముద్దులు షురూనే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.