English | Telugu

లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న పునర్నవి..

పునర్నవి అంటే చాలు బిగ్ బాస్ ఇంట్లో రాహుల్‌ సిప్లిగంజ్ తో చేసిన అల్లరి గుర్తొస్తుంది. ఆమె చిన్న చిన్న పాత్రలు చేసి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక పునర్నవి ఫాలోయింగ్ పెరిగింది. బిగ్ బాస్ బ్యూటీగానే పునర్నవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఒక్కరికి ఫ్యాన్ అయ్యింది. బిగ్ బాస్ హిస్టరీలో రాహుల్ పునర్నవి జోడికి వచ్చినంత క్రేజ్ ఏ బిగ్ బాస్ సీజన్ లోనూ ఎవరికీ అంతగా రాలేదు. వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ని కూడా ప్రజలు, ఫాన్స్ యాక్సెప్ట్ చేశారు. అలాంటి పున్ను ఇప్పుడు కొన్ని త్రో బ్యాక్ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "జీవితం నాకు మంచి, చెడు, అందం, ఆనందం వంటి ఎన్నో దశలను ఇచ్చింది. ఇక్కడ ప్రతి దశలోనూ నేనున్నాను" అని పోస్ట్ పెట్టింది.

పున్ను ఏంటంటే తనకు ఏదైతే నచ్చుతుందో అదే చేస్తుంది. ఇక ఆమె పిక్స్ చూస్తే ఆమె ముఖంలో ఆనందం ఆ బోల్డ్ నెస్ ఉట్టిపడుతూ ఉంటుంది. అలాంటి ఆమె పిట్టగోడ, ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి మూవీస్ లో కనిపించింది. బిగ్ బాస్ తరువాత ఆఫర్లు వచ్చినా ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. మరి మళ్లీ పునర్నవి తెరపై ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి. ఇక నెటిజన్స్ ఐతే "టాలీవుడ్ ప్రిన్సెస్ మీ మూవీస్ ని మిస్ అవుతున్నాం. శివంగిలా , మోనార్క్ లా ఉన్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ పునర్నవి మాత్రం తన లైఫ్ ని తనకు నచ్చినట్టు బాగా ఎంజాయ్ చేస్తోందన్న విషయం తెలుస్తోంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.