English | Telugu
కూరలో ఉప్పు తక్కువైందని నామినేట్ చేసిన ప్రియాంక జైన్..
Updated : Oct 31, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో తొమ్మిదవ వారం నామినేషన్ల హవా సాగింది. ఇప్పటివరకు ఒక ఎత్తు ఇక నుండి మరో ఎత్తు అంటూ సాగిన నామినేషన్ ప్రక్రియ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది.
ఈ వారం హౌస్ లో ఎవరు అన్ డిజర్వింగ్ అని భావిస్తున్నారో వారిని గార్డెన్ ఏరియాలోని డ్రాగన్ స్నేక్ దగ్గరికి తీసుకెళ్ళి నిల్చోబెట్టాలని కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ కోరాడు. ఇక ఈ వారం గౌతమ్ కృష్ణ కెప్టెన్ అయినందున అతడిని ఎవరు నామినేట్ చేయొద్దని, పల్లవి ప్రశాంత్ ని నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టమని బిగ్ బాస్ చెప్పాడు.
టాస్క్ లో ఫెయిర్ గేమ్ ఆడలేదని, ఆ రోజు కెప్టెన్సీ రేస్ నుండి నన్ను తప్పించినప్పుడు నువ్వు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదని అమర్ దీప్ ని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ప్రియాంక.. రతికని నామినేట్ చేసింది. నువ్వు రీఎంట్రీ తర్వాత ఒక బాంబ్ లాగా ఆడతావని అనుకున్నాను. గేమ్ లో స్పార్క్ కనపడలేదని, రాగానే ఒకరి దగ్గర స్ట్రక్ అయిపోయావని అనిపించిందనే కారణం చెప్పి రతికని నామినేట్ చేసింది ప్రియాంక. ఆ తర్వాత భోలే షావలిని నామినేట్ చేసింది ప్రియాంక. మీరు మిరపకాయల దండ వేసి కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించడం నాకు నచ్చలేదని ప్రియాంక అంది.
నా ఓటు నా హక్క. అయిన ఓటు వెయ్యలేదు. పోటు వేశానని భోలే అన్నాడు. కూరలో ఉప్పు తక్కువ వేసానని నామినేట్ చేసినట్టుందని ప్రియాంకతో భోలే అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టిని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. తప్పు చేసి సారీ చెప్పడం కాదు. టాస్క్ లో ఫౌల్ గేమ్ ఆడావ్. మజాక్ అది మనకి మజాక్ కానీ బయట నుండి చూసేవాళ్ళకి అది అలా కన్పించదని అర్జున్ చెప్పి శోభాశెట్టిని నామినేట్ చేశాడు. ఇవన్నీ సిల్లీ రీజన్స్ అంటూ శోభా శెట్టి అంది. ఆ తర్వాత అమర్ దీప్ ని అర్జున్ నామినేట్ చేశాడు. " నాకు రాగానే ఏం ప్రామిస్ చేశావ్. ఫౌల్ గేమ్ ఆడనని చెప్పావ్. నాగార్జున గారు రెండు వారాలు పొగిడేసరికి ఏం అయింది నీకు" అని అమర్ దీప్ తో అంబటి అర్జున్ చెప్పి నామినేట్ చేశాడు.