English | Telugu

లవ్ ప్రొపోజ్ చేసుకున్న మౌనరాగం జోడి!


"జానకి కలగనలేదు" హీరోయిన్ ప్రియాంక జైన్ ఆడియన్స్ కి బాగా పరిచయమే. ముద్దుగా బొద్దుగా అందంగా ఉంటుంది. ఇక ఈమె జోడి శివకుమార్ గురించి కూడా చెప్పక్కర్లేదు. "మౌనరాగం" సీరియల్ లో కలిసి నటించింది ఈ జంట. వీళ్ళను చూస్తే మాత్రం రియల్ జోడి ఏమో అన్న అనుమానం కలగక మానదు. షోస్ కి, ఈవెంట్స్ కి, ఫంక్షన్స్ కి ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్తారు. రీసెంట్ గా జరిగిన అమరదీప్-తేజు పెళ్లిలో ఈ జంట హవా మాములుగా లేదు. కానీ వాళ్ళ మధ్య వున్న విషయాన్ని ఏ వేదిక మీదా క్లారిటీగా చెప్పిందే లేదు.
కానీ ఇప్పుడు మాత్రం అసలు నిజం తమ ఫాన్స్ కి చెప్పేసారు ఇద్దరూ. వాలెంటైన్స్ డే స్పెషల్ షోగా ఆదివారం సాయంత్రం ప్రసారం కాబోతున్న 'లవ్ టుడే' కి ఈ జోడి కలర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చింది. శివ కోసం అద్దిరిపోయే డాన్స్ చేసింది ప్రియాంక. అంతే కాదు 'శివ ఐ లవ్ యూ' అని ఒక చార్ట్ మీద రాసి కూడా చూపించింది. దానికి శివ సిగ్గుపడిపోయాడు. వీళ్ళు రిలేషన్ షిప్ లో లేరు కానీ మొబైల్ పాస్ వర్డ్స్ తెలుసు అని రష్మీ ఆటపట్టించేసరికి "వి ఆర్ వర్క్ పార్ట్నర్స్..వర్క్ గురించి తెలుసుకోవడానికి కొంచెం" అని కవర్ చేసేసాడు శివ.

ఐనాసరే రష్మీ, రవి ఊరుకోకుండా కొంటెగా ఇద్దరి సెల్ పాస్ వర్డ్స్ ని టెస్ట్ చేసేసరికి అందరూ షాకయ్యారు. ఇక శివ కూడా వేళ్ళతో హార్ట్ షేప్ లో తన ప్రేమను చూపించాడు. శివకుమార్ 'ఇంటికి దీపం ఇల్లాలు' అనే సీరియల్ లో నటిస్తున్నాడు. ఇక క్యూట్ పెయిర్ 'నెవెర్ ఎండింగ్ టేల్స్' అనే యూట్యూబ్ ఛానెల్ వీడియోస్ చేస్తూ ఆడియన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.