English | Telugu

3మిలియన్స్ వ్యూస్ వచ్చిన రీల్ వెనుక కథ!

అదిదా మ్యాటర్.. ఓ రీల్ వెనుక ఎంత శ్రమ ఉంటుందో తెలియజేస్తూ శివ్, ప్రియాంక జైన్ చూపించారు. వాళ్ళిద్దరు కలిసి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ రీల్ చేశారు. దానికి 3మిలియన్ పైన వ్యూస్ వచ్చాయి. అయితే ఆ రీల్ చేయడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో చెప్తూ ఓ వ్లాగ్ చేసారు.

ఒక స్టెప్ చేయడానికి ప్రియాంక ఉదయం తొమ్మిది గంటల నుండి మద్యాహ్నం పన్నెండు గంటల వరకు వర్కవుట్ చేసిందంట. మధ్యలో పడిపోయిందని, బాడీ పెయిన్స్ అని, కళ్ళు మంటలెక్కాయని గంట పడుకుందంట. అదే విషయం శివ్ ఈ వ్లాగ్ లో తెలియజేశాడు. " కమాన్ పరి.. మనం చేయగలం. మనం సాధించగలం.. నేను నిన్ను ఎత్తుకొని అలా తిప్పాలి.. ఇప్పటికి చాలాసార్లు ఎత్తుకొని తిప్పాను. నేను అలసిపోవాలి కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది. నువ్వు అలసిపోయి పడుకున్నావ్.. నేను నిన్ను లేపుతున్నాను. శివ్ కెమెరా సెట్ చేసుకొని లైటింగ్ చూసుకొని ప్రియాంకకి ఆ స్టెప్ నేర్పించి అన్నీ తనే చేసిన ప్రియాంక ఇలా అవ్వుతుంది చూడండి ఫ్రెండ్స్ అంటు చెప్పుకొచ్చాడు. ఇక గంట పడుకొని లేచిన ప్రియాంక.. ఏప్రిల్ ఫూల్.. మే ఫుల్ అంటు అనగా.. ఇది ఇప్పుడు అవసరమా అన్నట్టుగా రియాక్షన్ పెట్టాడు. మొత్తానికి ఆ రీల్ వెనుక వారిద్దరి కష్టం ఉందంటూ తమ యూట్యూబ్ ఛానెల్ " నెవెర్ ఎండింగ్ టేల్స్ " లో తెలిపారు.

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు. ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్.‌ అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. శివ్, ప్రియాంక ఇప్పుడు చేసిన ఈ వ్లాగ్ ఫుల్ వైరల్ అవుతుంది. మీరు ఓసారి చూసేయ్యండి.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.