English | Telugu

Brahmamudi : మాయా దగ్గర ఉన్న సాక్ష్యాలేంటి. బాబు నాన్నెవరో  తెలిసిపోనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -402 లో.. కావ్య, అప్పు ఇద్దరు.. బాబుని రాజ్ తీసుకొని రావడం వెనక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అందులో భాగంగా రాజ్ ని బ్లాక్ మెయిల్ చేసిన అతని దగ్గరకి వస్తారు. రాజ్ మీకెందుకు డబ్బులు ఇస్తున్నాడు? మీరు ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కావ్య చెప్పమని బెదిరిస్తుంది. మాయ అనే ఆవిడా రోజు మా సెంటర్ లో బాబుని ఉంచి వెళ్తుంది.. ఒకరోజు అలా ఉంచకుండా బయట రాజ్ తో మాట్లాడడం విన్నానని అతను చెప్తాడు.

బాబుని దుగ్గిరాల ఇంటి వారసుడిగా ప్రకటించాలని, లేకపోతే సాక్ష్యాలతో సహా మీడియా ముందుకు వెళ్తానని మాయ బెదిరించగా.. రాజ్ వద్దని, మాయ చెప్పినట్లే చేస్తానని అన్నట్టుగా అతను చెప్తాడు. అదంతా విన్న అప్పు.. చూసావా బావ నిన్ను నిజంగానే మోసం చేశాడని అంటుంది. సగం నిజం మాత్రమే తెలిసింది. ఇంకా పూర్తిగా తెలియలేదు. ఆ రోజు నాతో నీ జీవితం గురించి నిర్ణయం తీసుకున్నాను.. రేపు చెప్తానని ఎందుకు అంటాడు. ఏదో జరిగింది మనం తెలుసుకోవాలని కావ్య అంటుంది. మరొకవైపు సేట్ ఇలా చేశాడేంటని రాహుల్, రుద్రాణి ఇద్దరు డిస్సపాయింట్ అవుతారు. అప్పుడే స్వప్న కావాలని.. వాళ్ళ ముందు కోటి రూపాయల కారు కావాలి.. మొత్తం ఒకేసారి ఇస్తానంటూ ఫోన్ లో మాట్లాడుతుంది. అది విని బీరువాలో రుద్రాణి పెట్టిన డబ్బులు చూస్తుంది. అక్కడ లేకపోయేసరికి స్వప్ననే ఇదంతా చేసిందని తిట్టుకుంటారు కానీ ఏం అనలేని సిచువేషన్ అని సైలెంట్ గా ఉంటారు.

ఆ తర్వాత అప్పు, కావ్య ఇద్దరు ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ ఆ రోజు రాజ్ ని ఎవరినైనా కలిసారా అని అందరిని అడుగుతారు. అందరు లేదని అంటారు. సెక్యూరిటీ ని అడుగగా సీసీటీవీ చూడమని చెప్తాడు. అందులో ఆ ఫుటేజ్ డిలీట్ చేసి ఉంటుంది.. హార్డ్ కాపీ ఉంటే మళ్ళీ రీస్టోర్ చెయ్యొచ్చని అప్పు అంటుంది. నువ్వు ఆ పని చేయమని అప్పుకి కావ్య చెప్తుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే.. రాజ్ రాగానే అపర్ణ వెళ్లిపోతుంటుంది. ఎందుకు వెళ్తాన్నారంటూ రాజ్ కి సపోర్ట్ గా కావ్య మాట్లాడుతుంది. తరువాయి భాగంలో హార్డ్ కాపీ రిస్టోర్ చేసి వీడియో నీకు పంపంచాను చూడని అప్పు చెప్పగానే.. కావ్య చూసి షాక్ అవుతుంది. అంటే ఈ బిడ్డ ఆయన బిడ్డ కాదన్న మాట అని కావ్య అనుకుంటుంది. ఇంతకీ ఆ బాబుకి నాన్న ఎవరు? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.