English | Telugu
ఇండస్ట్రీలో "నో" అని చెప్పడం ఒక పెద్ద ఆర్ట్!
Updated : Nov 22, 2022
టాలీవుడ్ లో జనరేషన్ మారి కొత్త కొత్త కామెడీ టైమింగ్స్ ఎంట్రీ ఇస్తున్న టైంలో పరిచయమయ్యారు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. "పెళ్లి చూపులు" మూవీతో ప్రియదర్శి పరిచయం కాగా, రాహుల్ రామకృష్ణ "అర్జున్ రెడ్డి" మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ప్రియదర్శి ఎలా మాట్లాడినా ఆడియన్స్ ఫుల్ గా నవ్వేస్తారు. ఇక ఆయన నటించిన "మల్లేశం" కావొచ్చు "జాతిరత్నాలు" కావొచ్చు ఆయనలోని నటుడిని బయటకు తీసుకొచ్చిన మూవీస్.
ఇక ఇప్పుడు ఈయన ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు. "ఇండస్ట్రీలో "నో" అని చెప్పడం ఒక పెద్ద ఆర్ట్ అన్నాడు. బయటైనా, ఇండస్ట్రీలో ఐనా హిపోక్రసి అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎలాంటి స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినా వాటిని స్టార్టింగ్ లెవెల్ లోనే ఫిల్టర్ చేసేస్తాను. ఇప్పటివరకు నాకు మంచి పాత్రలే వచ్చాయి. నాకు నచ్చని పాత్రలు అంటే బాడీ షేమింగ్ గురించి కానీ, వెకిలి కామెడీ వంటి వాటికి సంబంధించి వచ్చినప్పుడు సున్నితంగానే 'నో' చెప్పేస్తాను. అయితే ఇక్కడ 'నో' చెప్పడం కూడా పెద్ద కళ. ఎందుకంటే నో అని చెప్తే గనక తలపొగరు అనేసి ప్రచారం చేసేస్తారు. ఈయన పెద్ద ఆర్టిస్టు .. ఈయనకి నచ్చాలంటే .. నిన్నగాక మొన్నొచ్చాడు" అని అందరూ ఏదేదో అనేసుకుంటారు. అందుకే "ఇండస్ట్రీలో నోరు చాలా వరకు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సి ఉంటుంది. మరీ ఇబ్బందిగా అనిపించినప్పుడు మాత్రం మా మేనేజర్ సీతారాం గారు రంగంలోకి దిగుతారు.
ఇప్పుడు కాదు లెండి .. మరోసారి చూద్దాం అంటూ చెప్పి ఎదుటివాళ్లను జాగ్రత్తగా డీల్ చేసి మేనేజ్ చేసేస్తాడు. నటుడిగా నాకు కొంత గుర్తింపు రావడం మొదలయ్యాక కాస్త కోపాన్ని తగ్గించుకుని చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.