English | Telugu
ప్రియాంకకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ప్రియ
Updated : Dec 12, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 క్లైమాక్స్‌కి చేరింది. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఈవెంట్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హౌస్ నుంచి బయటికి వచ్చేసిన కంటెస్టెంట్‌లు సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. ఒకరిపై ఒకరికి వున్న అభిమానాన్ని, ప్రేమని చాటుకుంటూ నెటిజన్‌లకు షాకిస్తున్నారు. హౌస్ లో స్నేహం చేసిని కంటెస్టెంట్ లకు ప్రత్యేక బహుమతులు ఇస్తున్నారు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవల 13వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసిన ప్రియాంక తాజాగా నెట్టింట వైరల్ గా మారింది. కారణం తనకి నటి, మాజీ హౌస్ మేట్ ప్రియ గిఫ్ట్ ఇవ్వడమే. వివరాల్లోకి వెళితే.. హైస్‌లో ప్రియ, ప్రియాంక మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు కలిశాయి. ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా మరొకరు తల్లడిల్లిపోయేవారు. అంతలా ప్రియ, ప్రియాంక మధ్య అనుబంధం ఏర్పడింది. అది హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా కొనసాగుతోంది.
తమ అనుబంధానికి గుర్తుగా ప్రియ.. ప్రియాంకకు ఓ గోల్డ్ రింగ్‌ని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని పింకీ అభిమానులతో పంచుకుంటూ ప్రియకు డైమండ్ రింగ్ ని అందజేస్తున్న ఫొటోలని ఇన్ స్టా వేదికగా పంచుకుంది. `అక్క ఇచ్చిన బహుమతి తెరచి చూడగానే ఒక్కసారిగా షాకయ్యాను. అందులో డైమండ్ రింగ్ వుంది. ఇది నేను ఊహించలేదు. థాంక్యూ .. లవ్ యూ అక్క` అంటూ డైమండ్ రింగ్ ఫొటోని ప్రియాంక షేర్ చేసింది.