English | Telugu

"ముందు వంట‌ల‌క్క‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకో".. కార్తీక్‌ను ర‌ఫ్ఫాడిన దీప ఫ్యాన్స్‌!

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కార్తీక దీపం' సీరియ‌ల్ మ‌హిళాలోకాన్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇందులో న‌టించే నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్‌ల‌ని స్టార్‌ల‌ని చేసింది. మ‌రీ ముఖ్యంగా వంట‌ల‌క్క పాత్ర‌లో న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్ స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయింది. సోష‌ల్ మీడియాలో ఆమె కోసం భారీ స్థాయిలో ఫ్యాన్స్ ప‌ని చేస్తున్నారు. ఆమెకు వ్య‌తిరేకంగా ఎలాంటి పోస్ట్ ప‌డినా వెంట‌నే ఏకిపారేస్తున్నారు.

తాజాగా డాక్ట‌ర్ బాబు పాత్ర‌లో న‌టించిన నిరుప‌మ్‌ని కూడా వ‌ద‌ల లేదు. సోమ‌వారం అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ నిరుప‌మ్ ఓ వీడియోను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. "మీరు లేకుండా మేం లేమ‌ని తెలిసినా మిమ్మ‌ల్ని ఎంతో వేధిస్తుంటాం, ఏడిపిస్తూ వుంటాం. మీ ప‌ట్ల జంతువుల్లా ప్ర‌వ‌ర్తిస్తూ వుంటాం. అయినా ఓపిక‌తో భ‌రిస్తారు. ఎంతో స‌హ‌నంతో మ‌మ్మ‌ల్ని మార్చుకుంటారు. మార్పు మాలో రావాలి. మీకు మ‌రింత గౌర‌వం ద‌క్కాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచంలో వున్న వాళ్లంద‌రికీ హ్యాపీ ఉమెన్స్ డే."‌ అని వీడియోను పోస్ట్ చేశాడు నిరుప‌మ్‌.

ఈ వీడియోపై వంట‌ల‌క్క ఫ్యాన్స్ మామూలుగా రెస్పాండ్ అవ‌లేదు. "ముందు వంట‌ల‌క్క‌ని ద‌గ్గ‌ర‌కు తీసుకుని మ‌ళ్లీ మాట్లాడు.. ఇది ఓకే కానీ మీరు దీప‌ని ఎప్పుడు న‌మ్ముతారు? ఆమెను ఎప్పుడు చేర‌దీస్తారు?" అంటూ డాక్ట‌ర్ బాబుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ కామెంట్స్‌కి స‌మాధానం చెప్ప‌లేక నిరుప‌మ్ గ‌ప్‌చుప్‌ అయిపోయాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.