English | Telugu

దీప తండ్రిపై కార్తీక్ దౌర్జ‌న్యం!

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కార్తీక దీపం' రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ర‌స‌వ‌త్త‌రంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల చేత కంట‌నీరు పెట్టిస్తోంది. డాక్ట‌ర్ బాబు మార‌డ‌ని తెలుసుకున్న దీప త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో సిటీ వ‌దిలి వెళ్లిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. వార‌ణాసి బంధువుల స‌హా‌యంతో ఓ పాత ఇంటిలో దీప‌ కొత్త కాపురం మొద‌లుపెడుతుంది.

రోడ్డు ప‌క్క‌న ఇడ్లీ బండి పెట్టుకుని జీవ‌నం సాగించాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ఇదిలా వుంటే దీప త‌న‌కు చెప్ప‌కుండా ఊరు వ‌దిలి వెళ్లిపోయింద‌ని ఆమె తండ్రి ముర‌ళీకృష్ణ క‌న్నీరు మున్నీర‌వుతుంటాడు. ఓ సంద‌ర్భంలో దీప పెళ్లి ఫొటోని క‌నిపించ‌కుండా డాక్ట‌ర్ బాబు ప‌క్క‌న ప‌డేసిన ఫొటోని చూస్తూ ముర‌ళీకృష్ణ బాధ‌ప‌డుతుంటాడు. ఇదే స‌మ‌యంలో అక్క‌డ‌కి ఎంట్రీ ఇచ్చిన డాక్ట‌ర్ బాబు ఫొటోని లాగి కింద‌ప‌డేస్తాడు. దీంతో ఆ ఫొటో అద్దం ముక్క‌ల‌వుతుంది.

ఊహించ‌ని ప‌రిణామానికి షాకైన ముర‌ళీకృష్ణ "డాక్ట‌ర్ బాబు ఏంటీ దైర్జ‌న్యం?" అంటూ ఆవేశంతో ఊగిపోతాడు. "ఆడ‌పిల్ల వాళ్లం క‌దా అని ఎప్పుడు ఏది అన్నా స‌హిస్తామ‌నుకుంటున్నావా.. మా స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దుంటుంది." అంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య దీప గురించి వాదోప‌వాదాలు జ‌రుగుతాయి. దీప ఎక్క‌డుందో చెప్ప‌మంటూ డాక్ట‌ర్ బాబు ముర‌ళీకృష్ణ‌ను నిల‌దీస్తాడు. ఎక్క‌డుందో నాకు తెలియ‌ద‌ని చెప్పినా న‌మ్మ‌క‌పోవ‌డంతో భాగ్యం వచ్చి ఆయ‌న చెప్పేది నిజ‌మే అంటుంది.

దాంతో అక్క‌డి నుంచి ఇంటికి వెళ్లిన డాక్ట‌ర్ బాబు ఏం చేశాడు? దీప ద‌గ్గ‌రి నుంచి హిమ డాక్ట‌ర్ బాబు ద‌గ్గ‌రికి వ‌చ్చేసిందా? వంటి విష‌యాలు తెలుసుకోవాంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.