English | Telugu

మీరా వెన్నుపోటు ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా?

జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'. 'బొమ్మ‌రిల్లు' వెంక‌ట్ శ్రీ‌రామ్, వ‌ర్ష‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌తి సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ వీక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌ధానంగా అను పాత్ర‌లో న‌టిస్తున్న వ‌ర్ష ఈ సీరియ‌ల్‌కి యూఎస్‌పీగా మారింది. గ‌త వారం ఎపిసోడ్‌లో మీరాని నందిని టెక్స్ టైల్స్ కంప‌నీకి ఆర్య‌వ‌ర్ధ‌న్ సీఈవోగా అపాయింట్ చేస్తాడు.

ఇది ముందు అను ఫాద‌ర్ సుబ్బుకి న‌చ్చ‌దు కానీ ఆర్య‌వ‌ర్ధన్ క‌న్విన్స్ చేయ‌డంతో తాను పొర‌పాటు ప‌డ్డాన‌ని ఆర్య‌కు సారీ చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. అను సీఈఓ కావ‌డం జీర్ణించుకోలేని మీరా ఎలాగైనా అనుని దెబ్బ‌కొట్టాల‌ని, ఆర్య దృష్టిలో బ్యాడ్ చేయాల‌ని ప్లాన్‌లు వేస్తూ వుంటుంది. అందు కోసం పెద్ద ప‌థ‌కం వేస్తుంది. అనుని న‌మ్మించి ఆమె వ‌ద్దే ప‌ని చేస్తానంటూ చెప్పిన మీరా.. అలా న‌మ్మించి అనుని వెన్నుపోటు పొడ‌వాల‌ని ప్లాన్ చేస్తుంది.

ఈ ప్లాన్ బెడిసికొడుతుంద‌ని, అనుని దెబ్బ కొట్టాల‌న్న ప్లాన్‌తో ఆర్య‌ని ఇబ్బంది పెట్ట‌బోతున్నావ‌ని, ఈ విష‌యంలో మ‌రోసారి ఆలోచించి అడుగువేస్తే మంచిద‌ని జెండే (రాంజ‌గ‌న్‌) మీరాని హెచ్చ‌రిస్తాడు. అయితే తాను చేసేదే ఆర్య‌వ‌ర్ధ‌న్ కోస‌మ‌ని అన్న మీరా త‌న ప‌థకం ప్ర‌కార‌మే అనుని వెన్ను పోటు పొడిచిందా? ప‌క్క‌నే వుండి అనుని ఇబ్బందుల‌కు గురిచేయ‌బోతోందా? అన్న‌ది తెలియాలంటే సోమ‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.