Read more!

English | Telugu

ప్రణయ విలాసం మూవీ రివ్యూ

మూవీ : ప్రణయ విలాసం
నటీనటులు : అర్జుణ్ అశోకన్, అనస్వర రాజన్, మమితా బైజు, మియా జార్జ్
రచన: జ్యోతిష్ ఎమ్, సును ఏవీ
ఎడిటింగ్: బిను నెపోలియన్
మ్యూజిక్: షాన్ రహమాన్
సినిమాటోగ్రఫీ: షినోజ్
నిర్మాతలు : సిబి చవరా, రంజిత్ నయ్యర్
దర్శకత్వం: నిఖిల్ మురలి


కథ:

ఓ ప్రైవేట్ కాలేజీలో సూరజ్ ఎంబీఏ చదువుతుంటాడు. అదే కాలేజీ లో చదువుతున్న  గోపిక( మమితా బైజు) సూరజ్ ని  ప్రేమిస్తుంటుంది. అదే సమయంలో సూరజ్ వాళ్ళ నాన్న రాజీవ్ తన స్కూల్ మేట్స్ తో కలవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తాడు. రాజీవ్ కి సూరజ్ కి మాటలుండవు.  సూరజ్ వాళ్ళ అమ్మ పేరు  అనుశ్రీ.. ఇంటిపనులు చూసుకుంటు ఉంటుంది. రాజీవ్ కి తన స్కూల్ ఫ్రెండ్ మీరా అంటే  చాలా ఇష్టం.సుమారు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వాళ్లిద్దరు కలుసుకుంటారు. అయితే వీరిది స్నేహమా? లేక ప్రేమనా?  అసలు అనుశ్రీ ఎవరు? అనేది మిగతా కథ‌


విశ్లేషణ: 

కొన్ని కథలు రాసుకొని సినిమాగా మలుస్తారు. కానీ మరికొన్ని నిజ జీవితాలని చూసి తీస్తారు. ఈ సినిమా ఈ రెండో రకం . మన చుట్టూ జరిగే నిజమైన జీవితాలని విశ్లేషణ చేసి దానిని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడం బాగుంది. దర్శకుడు నిఖిల్ మురలి ముందుతరంలో ముగిసిపోయిన ప్రేమ కథని కొత్త తరానికి చేరవేసాడు.

ఈ సినిమాలో ప్రథమార్ధంలో వచ్చే లవ్ ట్రాక్, ద్వితీయార్థంలో వచ్చే సన్నివేశాలు పూర్తిగా భిన్నంగా అనిపిస్తాయి. అయితే ఇవి రెండు ఓ ప్రేమ జంట  జీవితాలని ప్రతిబింబించేలా ఉంటాయి. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూసే జాబితాలో ఈ సినిమా చేరింది. కథ సాగుతున్నకొద్దీ ప్రేక్షకుడిని అందులో లీనం చేశాడు దర్శకుడు. అప్పటిదాకా ఒకే ఇంట్లో విడివిడిగా ఉన్న నాన్న, కొడుకులు ఒక్కసారిగా కలుసుకోవడం ఎంతో ఆసక్తిగా ఉంటుంది.

ఇక ఆ డైరీలో ఉన్న వినోద్ ఎవరు అని సూరజ్ వాళ్ళ నాన్న అడిగినప్పుడు వచ్చే ఇంటర్ వెల్ చూసి.. అరెయ్ ఏంట్రా బాబు ఈ కథ అనిపిస్తుంది. ‌అయితే కథ సాగుతున్న కొద్దీ ఓ స్వచ్చమైన ప్రేమకథని పుస్తకంలో భద్రపరచిన అను రాసిన అక్షరాలు సినిమా చూసే ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. నా చివరి కోరికగా.. నా చితి మీద ఓ గులాబీ పువ్వు ఉంచుతావా వినోద్ అని అను డైరీలో రాసిన మాటలు ఎమోషనల్ గా మార్చేస్తాయి. కథలో ప్రథమార్ధంలో వచ్చే స్లో సీన్లు తప్పితే ఇది కల్ట్ క్లాసిక్. భిన్నమైన కథని ఇష్టపడేవారికి ఇది నచ్చేస్తుంది. షాన్ రహమాన్ మ్యూజిక్ కట్టిపడేసింది. షినోజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. బిను నెపోలియన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


నటీనటుల పనితీరు:

సూరజ్ పాత్రలో అర్జున్ అశోకన్ ఆకట్టుకున్నాడు. రాజీవ్ గా మనోజ్,  మీరా పాత్రలో మియా జార్జ్, గోపికగా మమితా బైజు, సూరజ్ తల్లి అనుశ్రీగా  శ్రీధన్య ఆకట్టుకున్నారు.


ఫైనల్ గా :  

రెండు తరాలని కవర్ చేస్తూ తీసిన ఈ సినిమా.. ప్రతీ ఒక్కరి జీవితాన్ని తిరిగి తొంగిచూసుకునేలా చేస్తుంది.


రేటింగ్: 2.75 / 5


✍️. దాసరి మల్లేశ్