English | Telugu
ముకుంద, మురారీల గురించి ప్రభాకర్ కి నిజం తెలిసిపోయిందా?
Updated : Oct 10, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -283 లో.. కృష్ణ టెన్షన్ పడుతు గదిలోకి వస్తుంది. తనని చూసిన మురారి.. ఏమైందని అడుగుతాడు. నేను ఇప్పుడే ముకుంద దగ్గర నుండి వచ్చానని కృష్ణ చెప్పగానే.. అంటే ముకుంద కృష్ణకి నిజo చెప్పేసిందా అని మురారి టెన్షన్ పడతాడు. ఏమైంది చెప్పు కృష్ణ అని మురారి అడుగుతాడు. కృష్ణ పడే టెన్షన్ చూసి మురారి మరింత టెన్షన్ పడతాడు.
ఆ తర్వాత కృష్ణ తను ఎందుకు కంగారుపడుతుందో చెప్తుంది. ఈ రోజు చవితి చంద్రుడిని చూసిన అని కృష్ణ బయపడుతుంది. నువ్వు ఇప్పటి వరకు టెన్షన్ పడేది అందుకేనా అని మురారి రిలాక్స్ అవుతాడు. ఆ తర్వాత కృష్ణ మురారి లు క్లోజ్ గా మాట్లాడుకుంటారు. అప్పుడే ముకుంద వాళ్ళ గది దగ్గరికి వచ్చి చూస్తుంటుంది. అలా వాళ్ళు క్లోజ్ గా ఉండడం ఓర్వలేక మురారి అని ఒక్కసారిగా గట్టిగ అరుస్తుంది. మిమ్మల్ని కిందకి రమ్మని అంటున్నారని ముకుంద అనగానే.. భార్యాభర్తలు ఇద్దరు గదిలో ఉన్నప్పుడు డోర్ కొట్టి రావాలని తెలియదా అని కృష్ణ కావాలనే ముకుందతో కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కృష్ణ కిందకి వస్తుంటే మురారి చూసి.. ఏంటి కృష్ణ ఎప్పుడు ఒకే చీర కట్టుకుంటావ్? వెళ్లి వేరే చీర కట్టుకొని రా అని అనగానే.. కృష్ణ వెళ్లి వేరొక చీరలో వస్తుంది. అలా రావడం చూసిన రేవతి.. ఏంటి ఇంట్లో పూజ జరిగినప్పుడు కూడా మంచి చీర కట్టుకోవాలని తెలియదా అంటూ కృష్ణని ఆటపట్టిస్తుంది రేవతి.
మరొకవైపు ప్రభాకర్ కాఫీ షాప్ లో మురారి, ముకుంద ఇద్దరు మాట్లాడుకోవడాన్ని గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే శకుంతల వచ్చి ఏమైందని అడుగుతుంది. ప్రభాకర్ చెప్పబోతుండగా మధు వచ్చి.. ప్రభాకర్ ని తీసుకొని వెళ్తాడు. మరొకవైపు ముకుందని తీసుకోని రమ్మని మురారిని శకుంతల పంపిస్తుంది. ముకుంద దగ్గరికి మురారి వెళ్ళగానే.. తన ప్రేమని చెప్తూ మురారికి చిరాకు తెప్పిస్తుంది. ముకుంద మురారి ఇద్దరు మాట్లాడుకోవడం ప్రభాకర్ చూస్తాడు. ఆ తర్వాత ముకుంద కిందకి వస్తుంది. మురారి ప్రభాకర్ కోసం చూస్తుంటాడు. మురారి వంక కోపంగా చూస్తాడు ప్రభాకర్. ముకుంద తో మాట్లాడడం మామయ్య చూశాడా అని మురారి కంగారుపడతాడు. ఆ తర్వాత ప్రభాకర్ మురారి చెయ్యి పట్టుకొని పైకి తీసుకొని వెళ్తాడు. అందరు వాళ్ళని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.