Read more!

English | Telugu

ఎక్స్‌ప్రెష‌న్స్ క్వీన్ పూర్ణ ఫుల్ చిల్ అవుతోంది!

పూర్ణ హ్యాపీగా పెళ్లి చేసుకుని తల్లి కాబోతోంది..రీసెంట్ గా ఈమె సీమంతం వేడుకలు కూడా జరిగాయి. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండాలో పూర్ణ కూడా అంతే హ్యాపీగా ఆడిపాడుతోంది. ఆ డాన్స్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్ లోడ్ చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ సునీత రావుతో కలిసి ఫుల్ ఛిల్ల్ అవుతోంది. "టంటం" అనే సాంగ్ కి ఇద్దరూ సేమ్ స్టెప్స్ తో సేమ్ ఎక్స్ప్రెషన్స్ తో చేశారు. సునీతరావు కూడా ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంది  

"ఓహ్ మై గాడ్ మేము కలిసి డ్యాన్స్ చేసి చాలా కాలం అయ్యింది..ఒక కొరియోగ్రాఫర్‌గా చాలా సంతోషకరమైన విషయం ఒకటి నీతో షేర్ చేసుకోవాలి..అదేంటంటే నా కొరియోని పర్ఫెక్ట్ గా చేస్తావు అందంగా మార్చేస్తావు. నీలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎవరికీ రావు. నువ్వే నా ఎక్స్ప్రెషన్స్ క్వీన్...మై బెస్టీ. నిన్ను చూసి చాలా రోజులయ్యింది .అమ్మవు అయ్యాక చూడడం చాలా సంతోషంగా ఉంది.నీకు నీ జూనియర్ కి నా ముద్దులు, హగ్గులు" అని కామెంట్ పెట్టింది. 

ఇక పూర్ణ  ఆది తీస్‌మార్‌ ఖాన్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నాని "దసరా" మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.  ఇక ఈమె ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో జడ్జిగా చేసి బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.