English | Telugu

ప్రపంచంలోనే ఖరీదైన హోటల్ ముందు పటాస్ ప్రవీణ్!

ఏదైన సరే మన దేశంలో మన ఊళ్ళో మన ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఇంకెక్కడా ఉండదు. కొందరు లగ్జరీ కోసం ఖరీదైన హోటల్స్ కి వెళితే మరికొందరు లైఫ్ లో ఒక్కసారైన అందులో ఒకరోజు ఉండాలని సామాన్యులు అనుకుంటారు. అయితే పటాస్ ప్రవీణ్ రీసెంట్‌గా దుబాయ్ వెళ్ళాడు. అక్కడ తనకి ఎదురైనా అనుభవాలని చెప్తూ వ్లాగ్స్ చేస్తున్నాడు.

బజర్దస్త్ అనేది ఎంతోమంది కనుమరుగయిపోయిన వారికి, అప్‌కమింగ్ కమెడియన్లకు ఛాన్స్ ఇచ్చింది. అలాంటి వారిలో ఒకరు పటాస్ ప్రవీణ్. ముందుగా పటాస్ అనే స్టాండప్ కామెడీ షోతో పరిచయమయిన ప్రవీణ్.. తన ఐడెంటిటీనే పటాస్ ప్రవీణ్‌గా మార్చుకున్నాడు. దుబాయ్ లోని అన్ని టూరిజం లోకేషన్స్ చూసిన ప్రవీణ్ బాగా ఎంజాయ్ చేశాడు. అయితే అన్నీ చూడటానికి బాగున్నాయి కానీ ఏదైనా కాస్ట్లీ అని అంటున్నాడు. అది దుబాయ్ లోనే రిచెస్ట్ హోటల్ అని.. అందులో ఉండటానికి రోజుకే ఆరు లక్షలు అవుతాయని దానిని ఓ వీడియోలో చూపించాడు ప్రవీణ్. ఇప్పుడు దానిముందే ఉన్నానంటు మీరు ఇలాంటి లగ్జరీ హోటల్ లో ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారంటు ప్రవీణ్ అడిగాడు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా, ఎడారిలో జీబ్ మీద ట్రావెలింగ్, ఒంటెలపై సవారి, వరల్డ్ ఫేమస్ హోటల్స్ అన్ని అక్కడే ఉన్నాయంటూ ప్రవీణ్ రకరకాల రీల్స్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉన్నాడు‌‌. జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని నవ్విస్తున్న ప్రవీణ్ .. సద్దాంతో కలిసి అంతకముందు శ్రీదేవీ డ్రామా కంపెనీలో చేశాడు. ఇప్పుడేమో తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు వస్తున్నాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.