English | Telugu

నిద్రలేని రాత్రులు గడుపుతున్న భావన లాస్య!

సినిమా నటులకి , సీరియల్ నటులకి షూటింగ్ లొకేషన్ కి వెళ్తే ప్యాకప్ అయ్యేంతవరకు తీరిక ఉండదు. అలా ఒక్కోసారి షూటింగ్ టైమ్ రాత్రి పన్నెండు కూడా దాటొచ్చు. అలాంటివి చాలా సినిమాల షూటింగ్ లలో మనం రెగ్యులర్ చూస్తుంటాం‌. అయితే సీరియల్స్ కూడా ఈ మధ్య అర్థరాత్రి వరకు కొనసాగుతున్నాయి. అదే విషయాన్ని తెలుపుతూ భావన లాస్య తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అదేంటో ఓసారి చూసేద్దాం.

స్టార్ మా టీవీలో‌ ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ లోని మల్లి అలియాస్ భావన లాస్య‌ చేరింది. మల్లిగా అందరికి పరిచయమైన భావన లాస్య.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. కరోనా లాక్ డౌన్ సమయంలో తను చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి విశేషమైన స్పందన రావడంతో, మల్లి సీరియల్ మేకర్స్ తనని సంప్రదించగా తను నటించడానికి ఒకే అంది.‌ ఇప్పటివరకు టెలివిజన్ సీరియల్స్ లో నటించిన భావన లాస్యకి 'మల్లి' తన తొలి తెలుగు సీరియల్. కాగా ఇందులో లాస్య ప్రియ ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.

టీవి యాక్టర్స్ ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అవుతున్నారు. అందులో బ్రహ్మముడి సీరియల్ టీమ్ టాప్ లో ఉన్నారు. కాగా ఇప్పుడు మల్లి సీరియల్ లోని లాస్య ప్రియ కూడా చేరింది. ఆ మధ్య 'సమ్మోహనుడ' పాటకి అదిరిపోయే లుక్స్‌తో హాట్ సారీతో డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడేమో తన ఇమ్ స్టాగ్రామ్ లో స్లీప్ లెస్ డేస్ అంటూ ఓ పోస్ట్ చేసింది. తను చేస్తోన్న సీరియల్ షూటింగ్ టైమ్ పెంచి మరీ తనకి నిద్రలేకుండా చేస్తున్నారని, నో స్లీప్ డేస్ అని చెప్పి అర్థరాత్రి ఒంటి గంట అవుతున్నట్లుగా టైమ్ కూడా పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. మరి మల్లి సీరియల్ లో భావన లాస్య నటనకి మీలో ఎంతమంది అభిమానులున్నారు కామెంట్ చేయండి.



Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.