English | Telugu

శివరాత్రి పండక్కి కందగడ్డ దొంగలు.. గోవా ప్లానింగ్ కోసమే!

శివరాత్రి పండగని తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఉదయం నుండి ఉపావసం ఉండి సాయంత్రానికి ‌దేవుడికి పలహారంగా కందగడ్డ ( స్వీట్ పొటాటో) సమర్పించి దానిని ఇంట్లోని వాళ్ళంతా కలిసి తింటారు. ఇప్పుడు అదే కందగడ్డ కి మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.

అయితే కందగడ్డని తెలంగాణలో ఒకలా.. ఆంధ్రాలో మరో పేరుతో పిలుస్తారు. దానిని కొన్నిచోట్ల కూరలా కూడా చేసుకుంటారు. అయితే శివరాత్రి కోసం తెలంగాణలో ఇప్పటికే పూజలు మొదలయ్యాయి. గంగవ్వ తెలంగాణలో ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. తను బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చింది. ఇప్పుడేమో రెగ్యులర్ గా అప్‌డేట్ వ్లాగ్స్ చేస్తూ అందరికి దగ్గరగా ఉంటుంది. తను చేసే వ్లాగ్స్ కి తెలంగాణలో ‌మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా ' విలేజ్ షో మిక్స్ ' అనే యూట్యూబ్ ఛానెల్ లో " శివరాత్రి పండక్కు కందగడ్డ దొంగలు - గోవా ప్లానింగ్స్ " అనే వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. ఇందులో గంగవ్వ, చందు, అంజిమామ , ఇంకా కొందరు కలిసి తమ ఇన్నోసెన్స్ తో పాటు సింపుల్ కామెడీతో అందరిని ఆకట్టుకుంటున్నారు. మరి ఈ వ్లాగ్ లో ఏం ఉందో ఓసారి చూసేద్దాం.

అంజిమామ, చందు కలిసి పొలంలో పండిన కందగడ్డ తీసుకొని ఊరురా తిరిగి బాగానే డబ్బులు లాభం పొందుతారు. అయితే అందరు కలిసి గంగవ్వకి తెలియకుండా గోవాకి వెళ్ళాలనుకుంటారు. దీనిలో భాగంగానే గోవా ప్లానింగ్ కోసం కందగడ్డ అమ్మగా వచ్చిన డబ్బులలో కొన్ని దాచేసి మిగిలినవి వాళ్ళ అమ్మ గంగవ్వకి ఇస్తాడు చందు. ఇక అంత తక్కువ వచ్చినయేంటని గంగవ్వ భాదపడుతుంటుంది. అది చూసి వాళ్ళ పెద్దవ్వ అంజనం వేస్తుంది. అయితే గంగవ్వ కొడుకు చందు పొలంలో పందికొక్కులు చేరి అంతా నాశనం చేసినవని, కందగడ్డ అమ్మగా వచ్చినవి రెండు వేలే అని చెప్పగా.. అంజనంలో నిజం తెలిసిపోతుంది. పొలంలో పడింది పందికొక్కులు కాదు దొంగలని ఆ పెద్దవ్వ చెప్తుంది. ఇక చేసేదేమీ లేక చందు తము చేసిన తప్పు ఒప్పుకుంటాడు. ఇక గంగవ్వ అందరిని తిడుతుంది. అయితే ఇప్పుడు ఈ వ్లాగ్ యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మరి మీలో ఎంతమంది ఈ వీడియోని చూశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.