English | Telugu
రంగులు మార్చే ఊసరవెల్లి ఇనయా!
Updated : Oct 28, 2022
బిగ్ బాస్ హౌస్ లో జరుగుతోన్న సన్నివేశాలు, వారాలు గడిచేకొద్ది ఉత్కంఠభరితంగా సాగుతూ వస్తున్నాయి. అయితే మొదటి వారం నుండి వీక్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళు కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా మారిపోతున్నారు. వాళ్ళలో ఒకరు ఇనయా.
అయితే హౌస్ లో మొదటి వారం నుండి 'టామ్ అండ్ జెర్రీ' లాగా ఉన్న ఇనయా, శ్రీహాన్. గత కొన్ని రోజుల నుండి మిత్రులుగా ఉంటు కలిసిపోయినట్టుగా అనిపించారు. కాగా గత వారం ఇనయా, సూర్య మీద కోపంతో శ్రీహాన్ ని పొగడటం స్టార్ట్ చేసింది. అలాగే రేవంత్ తో కూడా సూర్య గురించి మాట్లాడుతూ, "తనతో ఉంటే ఏం తెలియలేదు. కానీ ఇప్పుడు తెలుస్తోంది" అని అంది. రేవంత్ దగ్గర సూర్య గురించి నెగెటివ్ గా పోట్రేట్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత "సూర్యని టాప్ ఫైవ్ లో ఉండనివ్వొద్దు" అంటు, మరో వైపు శ్రీహాన్ ని పొగడటం స్టార్ట్ చేసింది. లాస్ట్ వీక్ లో రాత్రికి రాత్రే మాట మార్చేసింది. గత వారం నామినేషన్ రోజు శ్రీహాన్ దగ్గరగా వెళ్ళి ఇనయా మాట్లాడుతూ, "నిన్ను నామినేట్ చేయడం ఇష్టం లేదు. నువ్వు నన్ను నామినేట్ చేసావ్. కాబట్టే నేను చేశాను. అంతే కాని యూ ఆర్ ఫార్ బెటర్ దెన్ ఎనీవన్ ఇన్ దిస్ హౌస్" అని పాజిటివ్ గా పొగిడేసింది.
గతవారం నాగార్జున, శ్రీహాన్ తో మట్లాడుతూ, "ఇనయా, సూర్య ఇద్దరు నటిస్తోన్నారు" అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే చివరి టాస్క్ లో "ఎవరు అయితే కెప్టెన్ గా అనర్హులు అని భావిస్తారో, వాళ్ళ మెడలో ఉన్న 'సి' లెటర్ తో ఉన్న థర్మకోల్ షీట్ మీద కత్తితో గుచ్చి మీ అభిప్రాయం తెలియజేయండి" అని బిగ్ బాస్ చెప్పాడు. కాగా సూర్య, కీర్తి భట్, శ్రీహాన్ కెప్టెన్సీ పోటీదారులుగా ఉండగా, శ్రీహాన్ కి కత్తి గుచ్చేసి, కెప్టెన్ గా అనర్హుడివి అన్నట్టుగా చెప్పేసింది. అయితే ఇది చూసిన హౌస్ మేట్స్ ఆశ్చర్యపోయారు. దీనికి కారణం గత వారం నుంచి ఇనయా, శ్రీహాన్ తో బాగా ఉంటోంది. అలాగే సూర్యతో మాట్లాడట్లేదు. కాగా శ్రీహాన్ బాధపడ్డాడు. అలా బాధ పడుతూ శ్రీసత్యతో చెప్పుకున్నాడు. "ఊసరవెల్లి నాకు వేసింది.
వారానికో రంగు మారుస్తూ, నాకు నమ్మక ద్రోహం చేసింది. పక్కా చెబుతున్నా తను వేసిన ఈ స్టెప్ కి రీగ్రేట్ అవుతుంది చూడు" అని శ్రీహాన్, శ్రీసత్య తో చెప్పుకొని బాధపడ్డాడు.
ఇనయా ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటిస్తోంది. అయితే తన ప్రవర్తన నిజంగానే 'రంగులు మార్చే ఊసరవెల్లి' ని తలపిస్తోంది. అని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాబోయే రోజుల్లో ఇనయా ఎవరితో సన్నిహితంగా ఉంటుందో? ఎవరితో శత్రువుగా ఉంటుందో? అనే విషయం ఇప్పుడు హౌస్ లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.