English | Telugu

నా రూటే సెపరేటు అంటున్న శ్రావణ భార్గవి!

శ్రావణ భార్గవి పేరు అందరికీ పరిచయమే. బాలకృష్ణ నటించిన 'సింహా' మూవీలో "సింహమంటి చిన్నోడే" సాంగ్ పాడి తన కెరీర్ ని స్టార్ట్ చేసింది భార్గవి. తర్వాత మహేష్ బాబు 'ఖలేజా', అల్లు అర్జున్ 'బద్రీనాథ్', రామ్ 'కందిరీగ' నాగార్జున 'రాజన్న', జూనియర్ ఎన్టీఆర్ 'దమ్ము', శేఖ‌ర్ క‌మ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', నాని 'ఎంసీఏ', ప్ర‌భాస్‌ 'రెబల్' మూవీస్ లో హిట్ సాంగ్స్ పాడి తనని తానూ ప్రూవ్ చేసేసుకుంది. 2018 లో వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో ఓ పాట పాడింది శ్రావణ భార్గవి. ఇక ఆ తర్వాత ఆమె మూవీస్ లో సాంగ్స్ ఏమీ పాడలేదు. డబ్బింగ్ విషయానికి వస్తే ‘గబ్బర్ సింగ్’ లో శ్రుతి హాసన్ కు, ‘ఈగ’ లో సమంతకి వాయిస్ ఇచ్చింది. ఇక ఇటీవలి కాలంలో శ్రావణ భార్గవి ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

తన భర్తతో విడాకులు విషయం అంటూ కొద్ది రోజులు, తర్వాత అన్నమ్మయ్య రచించిన ‘ఒకపరికొకపరి వయ్యారమై…’ కీర్తనను శృంగారభరితంగా మార్చి వీడియో చేసిందంటూ అపవాదులు ఆమె చుట్టూ తిరిగాయి. అన్నమయ్య కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి ఆమెని తిరుపతిలో అడుగుపెట్టనివ్వం అంటూ హెచ్చరించారు కూడా. ఈ విషయం మీద శ్రావణభార్గవి కూడా తన వెర్షన్ లో జవాబు ఇచ్చేసింది.

ఈ వార్తలతో ఇటీవలి కాలంలో శ్రావణ భార్గవి క్రేజ్ చాలా పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక మూవీ సాంగ్ తో దుమ్ము రేపడానికి నాలుగేళ్ల తర్వాత బయటికొచ్చింది శ్రావణ భార్గవి. విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీలో ‘ఆఫత్’ అనే అద్భుతమైన సాంగ్ పాడి అందరినీ కట్టిపడేసింది తన గాత్రంతో. ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.