English | Telugu

ఓ బేబీ కోసం శివాజీ ఉగ్రరూపం.. గేట్లు తియ్యమన్న గౌతమ్!

బిగ్ బాస్ సీజన్-7 ఫ్యామిలీ వీక్ ఫుల్ సక్సెస్ ఫుల్ అవుతుంది. రోజుకి ముగ్గురు కంటెస్టెంట్స్ చొప్పున వారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అటు హౌస్ మేట్స్ లో కాన్ఫిడెన్స్, ఇటు ప్రేక్షకులకి కావల్సిన ఎమోషన్స్ ని ఇప్పిస్తున్నాడు బిగ్ బాస్.

ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇది తెలుస్తుంది. ' ఓ బేబీ టాస్క్ ఫర్ కంటెస్టెంట్స్' అంటూ రిలీజ్ చేసిన ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. గత కొన్ని రోజులుగా గౌతమ్ కృష్ణ, శివాజీల మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు లావాలా బయటకొచ్చింది. గార్డెన్ ఏరియాలో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒక టేబుల్ పై వరుసగా బేబీ డాల్స్ ఉంచి.‌. బజర్ మోగిన తర్వాత ఆ బేబీ డాల్స్ ని తీసుకొనొ ఎవరైతే ఆ లైన్ దాటుతారో వాళ్ళు ముందుకు వెళ్తారు. రాలేని వారు వెనక్కి వెళ్తారని బిగ్ బాస్ చెప్పగానే కంటెస్టెంట్స్ పరుగు తీసారు. ఇందులో గౌతమ్ కృష్ణ బేబీ డాల్ ని అమర్ దీప్ లాక్కొని తీసుకెళ్ళాడని వాదించాడు. అయితే అది నా గేమ్ స్ట్రాటజీ అని అమర్ దీప్ అనగానే.. గౌతమ్ సీరియస్ అయ్యాడు.

ఫెయిర్ గేమ్ ఆడాలని గౌతమ్ తో శివాజీ అనగానే.. నాకు అన్యాయం జరిగిందని నేను డిఫెండ్ చేసుకుంటున్నా మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వొద్దంటూ గౌతమ్ రెచ్చిపోయాడు. ఇక ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. కెప్టెన్సీ రేస్ లో ఇటువంటివి కామన్‌.‌ కానీ ఇప్పటికే గౌతమ్ కృష్ణకి చాలా నెగెటివిటి వచ్చింది. ఇక శివాజీతో జరిగిన గొడవ తర్వాత.. బిగ్ బాస్ గేట్లు తీయండి బయటకు వెళ్తానని గౌతమ్ కృష్ణ అనడంతో హౌస్ మేట్స్ వద్దని అరుస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ ప్రోమో ఫుల్ వైరల్ గా మారింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.