English | Telugu

నాన్న ఎవ్వరికైనా నాన్నే.. ఫ్యామిలీ వీక్ రతికకి పాజిటివ్ అవ్వనుందా?



నాన్న కూతురు మధ్య బాండింగ్ ఎప్పుడు ప్యూర్ గా ఉంటుంది. అది బిగ్ బాస్ హౌస్ లోనైనా ఏ హౌస్ లోనైనా ప్రతీ ఒక్కరికి సపరేట్ ఫ్యామిలీ ఉంటుంది. మన కంటికి కన్పించేది, బిగ్ బాస్ చూపించేది ఒక వైపు మాత్రమే.. అదే ఇండివిడ్యువల్ గా చూస్తే ప్రతీ ఒక్క కంటెస్టెంట్ వెనుక ఒక గతం ఉంది‌. ఒక ఎమోషనల్ కథ దాగి ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఈ ఎపిసోడ్ లన్నీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి.

హౌస్ లోకి మొదటగా శివాజీ వాళ్ళ కొడుకు వెంకట్ వచ్చాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య, భోలే షావలి భార్య, గౌతమ్ కృష్ణ వాళ్ళ తల్లి, యావర్ అన్న, అమర్ దీప్ భార్య, శోభాశెట్టి అమ్మ.. ఇలా అందరు రావడంతో హౌస్ అంతా ఎమోషనల్ అయ్యారు. కాగా ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి ప్రోమోలో పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న రాగా.. ఈ ఎపిసోడ్ మీద ఫుల్ హైప్ క్రియేట్ అయింది‌.‌ కాగా తాజాగా రిలీజ్ చేసిన రెండవ ప్రోమోలో రతిక వాళ్ళ నాన్న రాములు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. వచ్చీ రాగానే రతిక పరుగున వెళ్ళి వాళ్ళ నాన్న గుండెలకు హత్తుకుంది. సరదాగా మాట్లాడింది. ఇక హౌస్ మేట్స్ అందరితో రతిక వాళ్ళ నాన్న మాట్లాడాడు. పల్లవి ప్రశాంత్ ని పిలిచి.‌‌ ఆటలు బాగా ఆడుతున్నావ్. ఇలాగే ఆడు. కప్పు కొట్టు అంటూ తన కూతురు రతిక ముందే చెప్పాడు.

రతిక వాళ్ళ నాన్న మాట్లాడిన విధానానికి పల్లవి ప్రశాంత్ ఆశ్చర్యపోయాడు. అయితే నాన్న ఎవ్వరికైనా నాన్నే. రతిక ఎంత నెగెటివిటి తెచ్చుకున్నా, వాళ్ళ నాన్న రాగానే అందరిలో ఒక పాజిటివిటి వచ్చేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రోమో కింద కామెంట్లలో రతిక గురించి నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ లో ఉన్న రతిక ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది‌. మరి ఈ ఎపిసోడ్ తనకి ప్లస్ అవుతుందా లేక ఈ వారం ఎలిమినేట్ అయి బయటకొస్తుందా చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.