English | Telugu

తనొక గ్రహాంతరవాసి కప్ప అని పోస్ట్ చేసిన ఆరోహీ రావు!

ఆరోహీ రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికి పరిచయమైంది. బిగ్ బాస్ హౌస్ లో సూర్యతో కలిసి ఎక్కువ సమయం గడిపిన ఈ భామ.. ఇనయా సుల్తానా, కీర్తభట్ లతో మొదట్లో మంచి స్నేహాన్ని కలిగి ఉండేది. అయితే సూర్యతో స్నేహం మొదలయ్యాక అందరిని పక్కన పెట్టేసి సూర్య ఎక్కడుంటే అక్కడ టైం గడిపేది‌‌. ఆ రకంగా హౌస్ లో ఎంతో కొంత గుర్తింపు పొందింది ఆరోహి రావు.

బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహీ.. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహీ రావు. ఆరోహీ రావు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఆరోహీ వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహీ చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహీ.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహీ.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదాగా గడిపింది.

హౌస్ నుండి బయటకొచ్చాక ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఆర్జే సూర్యతో రీల్ ని చేసింది. అయితే ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో‌ రీల్స్ తెగ చేస్తోన్న ఆరోహీ.. ఇప్పుడు కొత్తగా వచ్చిన సోషల్ మీడియా ఆప్ 'థ్రెట్స్'.. లో తనకంటూ అకౌంట్ క్రియేట్ చేసుకుంది ఆరోహీ. అయితే తన ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోని అప్లోడ్ చేసి, దానికి ' గ్రహాంతరవాసి కప్ప' అనే క్యాప్షన్ కూడా పెట్టింది ఆరోహీ. కాగా ఈ పోస్ట్ చూసిన తన ఫ్యాన్స్ సరదగా ఆటపట్టిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఆరోహీ చేసిన ఈ పోస్ట్ ట్రెండింగ్ లో ఉంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.