English | Telugu

రియ‌ల్ క‌పుల్స్‌తో పెట్టుకుంటే ప‌గిలిపోద్ది!

స్టార్ మా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ క్రేజీ షోల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. బిగ్‌బాస్ సీజ‌న్ 4తో మ‌రింత పాపులారితో పాటు టీఆర్పీని సొంతం చేసుకుని లీడింగ్ ఛాన‌ల్ గా మారిన స్టార్ మా తాజాగా '100% ల‌వ్‌' షోతో మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందించ‌బోతోంది. రియ‌ల్ క‌పుల్స్ వ‌ర్సెస్ రీల్ ‌క‌పుల్స్‌తో ఈ షోని ప్రారంబించారు.

యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ ఈ షోకు వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఈ షో సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌సారం కాబోతోంది. ఆరు రియ‌ల్ జంట‌లు.. ఆరు రీల్ జంట‌లు ఈ షోలో పాల్గొంటున్నారు. కార్తీక దీపంతో పాపుల‌ర్ అయిన నిరుపమ్‌ త‌న భార్య మంజుల‌‌తో క‌లిసి ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆట‌ల్ని భార్య‌తో క‌లిసి ఆడిన నిరుప‌మ్ "రియ‌ల్ క‌పుల్‌తో పెట్టుకుంటే ప‌గిలిపోద్ది" అంటూ రీల్ జంట‌ల‌ని ఉద్దేశించి అన్న మాట‌లు వైర‌ల్‌గా మారాయి.

దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇందులో ఆరు రీల్ జంట‌లుగా సీరియ‌ల్ జోడీలు పాల్గొన‌గా.. ఆరు రియ‌ల్ లైఫ్‌లో భార్యాభ‌ర్త‌లైన జంట‌లు పాల్గొన్నాయి. వీరంతా క‌లిసి పోటాపోటీగా ఆడిన ఆట‌లు.. చేసిన అల్ల‌రి వీక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేసేదిగా వుంది.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.