English | Telugu

టైటిల్ ట్రోఫీని మనలో ఒక్కరే ఎత్తాలి.. నిఖిల్ సంచలన నిర్ణయం!

బిగ్ బాస్ సీజన్-8 ఎనిమిదో వారం వరకు వచ్చేసింది.‌ఇప్పటికే విన్నర్ ఎవరో ఒకరని అంచనాకి ప్రేక్షకులు రానే వచ్చారు. అయితే వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఎనిమిది మంది రాయల్ క్లాన్ గా ఉన్న విషయం తెలిసిందే. వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన మొదటి వారం దాదాపు ప్రతి టాస్క్ లో వాళ్లే విన్ అయి ఓజీ క్లాన్ ని డిప్రెషన్ లోకి నెట్టారు.

వీళ్ళు బాగా ఆడితే మనల్ని పిలిచేవాళ్ళు కాదు కదా అంటూ గంగవ్వ స్టేట్ మెంట్ కూడా పాస్ చేసింది. అయితే గత వారం నాగార్జున ఓజీ క్లాన్ అందరిని తమ ఆట తగ్గిందని చెప్పకనే చెప్పాడు. అదంతా అవమానంగా ఫీల్ అయిన ఓజీ క్లాన్ లోని వాళ్ళంతా ఫుల్ జోష్ లో ఆడారు. ఈ వారం రాయల్స్ గట్టి పోటీ ఇవ్వాలని అనుకున్నారు. వరుసగా రెండు టాస్క్ లు గెలిచి తమ సత్తా చాటుకున్నారు. అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. మేమ్ చాలా గెలిచినం.. గీ ఒక్క దాంట్లో గెలిస్తేనే ఇంత సంబరపడుతున్నారా అని గంగవ్వ వాళ్ళని చులకన చేసి మాట్లాడుతుంది. దాంతో‌ పాటు ఓజీ క్లాన్ లోని ప్రేరణ, యష్మీలకి మధ్య చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వస్తుంది. అయితే దాన్ని నిఖిల్ సాల్వ్ చేస్తాడు. మనం మనమే కొట్టకుంటే బాగోదని క్లాన్ తో నిఖిల్ మాట్లాడతాడు మన క్లాన్ నుండి మాత్రమే ఈ బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వాలని నిఖిల్ చెప్తాడు.

ఆ తర్వాత నబీల్, ప్రేరణ కూడా మాట్లాడుకుంటారు. అన్ని టాస్క్ లు వాళ్ళు గెలిచామన్న పొగరు వాళ్లలో ఉంది.. మనం ఇలాగే ఆడి గెలవాలని నబీల్ తో ప్రేరణ అంటుంది. మరుసటి రోజు కూడా మన క్లాన్ నుండే టైటిల్ విన్ అవ్వాలి.. టైటిల్ ఎత్తాలి.. ఎత్తాం కూడా అని నిఖిల్ వాళ్లలో జోష్ నింపుతాడు. దాంతో తథాస్తు‌ అని విష్ణుప్రియ అంటుంది. దానికి ఓజీ క్లాన్స్ అందరు ఫుల్ జోష్ లో ఉంటారు. నిఖిల్ స్ఫూర్తితో ఓజీ క్లాన్ ఇంకా ఎన్ని టాస్క్ లు గెలుస్తారో‌ మునుముందు తెలుస్తుంది. ఇక టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.