English | Telugu

జర్మనీలో నేహా చౌదరి కొత్త కాపురం.. అమ్మని మిస్ అవుతున్నానని ఏడుపు!


టీవి యాంకర్ గా ఫేమస్ అయిన నేహా చౌదరి.. ఐపీఎల్ కి స్టార్ స్పోర్ట్స్ తెలుగులో యాంకర్ గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా చేసింది. బిగ్ బాస్ సీజన్-6 తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌస్ మొదటి రెండు వారాలు బాగా టాస్క్ లు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత చంటితో గొడవ, ఇనయాతో గొడవ కారణంగా ఎలిమినేషన్ దగ్గరి దాకా వచ్చి సేఫ్ అయింది. అయితే రేవంత్ తో జరిగిన గొడవ ముదిరింది. అందులో అతని తప్పేం లేకున్నా రేవంత్ ని దూషించి, నోరు పారేసుకున్న నేహా.. ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక నేహాకి భారీ వెల్ కమ్ లభించింది.

బిగ్ బాస్ ముందు స్పోర్ట్స్ యాంకర్ గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి అవార్డ్ కూడా వచ్చింది. సయ్యారే ప్రోగ్రామ్ లో యాంకర్ గా చేసి అవార్డ్ కూడా సొంతం చేసుకుంది. ఇలా పలు టీవీ షోస్, ప్రోగ్రామ్‌లు చేసి నేహా చౌదరి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన గురించి రెగ్యులర్ గా అప్డేట్స్ ని అందిస్తూ నేహా ఫ్యాన్స్ కి మరింత దగ్గరగా ఉంటుంది.

రీసెంట్ గా నేహా ఒక సినిమా షూటింగ్ నిమిత్తం పూణేకి వెళ్ళివచ్చింది. ఆ తర్వాత రెండు మూడు వ్లాగ్ లు చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. మన వంటకాలు నేర్చుకుంటున్న ఫారెనర్స్, బీచ్ లో యోగ, కాపురానికి వెళ్ళే ముందు ఇంటి పనులు నేర్పిస్తుంది అమ్మ లాంటి వ్లాగ్ లు చేసింది నేహా. ఇప్పుడు తాజాగా తను జర్మనీ వెళ్ళినట్టుగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అక్కడ తన భర్తతో కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేసింది నేహా. మరొక వీడియోలో.. "అమ్మ ఐ ఆల్రెడీ మిస్ యూ.. ఎందుకో తెలుసా.. ఈ బ్రెడ్ బ్రేక్ ఫాస్ట్ అంట.. ఇక్కడ ఇదే తినాలంట, నేను ఇలా చెప్తుంటే పక్కనుండి మా ఆయన అప్పుడే కంప్లెంట్స్ స్టార్ట్ చేసావా అని అంటున్నాడు అమ్మ" అని నేహా చౌదరి చెప్పింది. ఇప్పటికీ తను ఇండియాని, ఇండియాలో ఉన్న వాళ్ళ అమ్మని.. ఆవిడ చేతి వంటని మిస్ అవుతున్నట్టుగా చెప్తుంది నేహా. ఇలా జర్మనీలో కొత్త కాపురం స్టార్ట్ చేసింది నేహా. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.