English | Telugu

గుండె పిండేసావ్..నీది బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్

"గాల విత్ బాల" అంటూ ఇండియన్ ఐడల్ సీజన్ 2 కంటెస్టెంట్స్ తో ఆడిపాడారు బాలయ్య. ఇప్పుడు సింగర్ గా సెలెక్ట్ ఐన కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. "తన వయసేమో పదహారు...జోరేమో సెలయేరు ..కార్తికేయ..నీ ఫాలోయింగ్ ఏందిరయ్యా" అని డాన్స్ తో కూడిన ఇంట్రడక్షన్ ఇచ్చారు బాలయ్యబాబు. ఇక కార్తికేయ తన టాలెంట్ చూపించుకుని టైం వచ్చేసరికి చేతిలో గిటార్ పట్టుకుని స్టేజి మీదకు వచ్చాడు. తర్వాత కేరాఫ్ కంచరపాలెం మూవీ నుంచి "ఆశాపాశం" సాంగ్ ఇరగదీసి మంచి ఎనెర్జీతో పాడి వినిపించాడు.

ఆ పాట విని "గుండె పిండేశావయ్యా..ఇది బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ " అని కాంప్లిమెంట్ ఇచ్చారు బాలయ్య. "నీ ఎనెర్జీ మాములుగా లేదు చాలా హైలో ఉంది" అని తమన్ పొగిడేశారు. అలాగే మరో జడ్జి కార్తిక్ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. "యూ హావ్ మై హార్ట్..కీప్ ఇట్ సేఫ్ " అంటూ బాలయ్య కార్తికేయ టీ షర్ట్ మీద బ్లాక్ మార్కర్ తో రాసి ఒక హైఫై ఇచ్చారు. ఇండియన్ ఐడల్ సీజన్ 2 కోసం సెలెక్ట్ ఐన సింగర్స్ ను తన డాన్స్ తో ఒక రేంజ్ లో పరిచయం చేసే స్పెషల్ ఎపిసోడ్ తో ఒక్కో సింగర్ ని బాలయ్య ద్వారా పరిచయం చేయిస్తోంది ఆహా.. ఈ ఎపిసోడ్ కు "గాల విత్ బాల" అనే ట్యాగ్ ఇచ్చారు. ఇక దీని కోసం బాలకృష్ణ వాళ్ళ పేర్లతో ఉన్న పాటలు కూడా పడేసారు. అన్‌స్టాపబుల్‌ షోలో ట్రెడిషనల్ గా కనిపించిన బాలయ్య ఇందులో మాత్రం ట్రెండీ స్టైలిష్ లుక్ లో కనిపించి ఫాన్స్ ని అలరించారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.