English | Telugu

నీ అందం మా మతి పోగొడుతోంది అంటూ డాన్స్ చేసిన బాలయ్య


ఇండియన్ ఐడల్ సీజన్ 2 చాలా గ్రాండ్ ఇంకెంతో కలర్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది. బాలకృష్ణ స్టైలిష్ లుక్ లో సాలిడ్ గా ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఒక్కో సింగర్ కంటెస్టెంట్ ని తనదైన స్టయిల్లో పాట పాడి మరీ వాళ్ళను మెస్మోరైజ్ చేసి వాళ్ళను స్టేజి మీద ఆహ్వానిస్తున్నారు. ఇక ఇప్పుడు శృతి వంతు వచ్చింది. న్యూ జెర్సీలో పుట్టిన పిల్ల...తన రూటే సెపరేటు మళ్ళా..శృతి ఓ శృతి..నీ అందం పోగొట్టే మా మతి.." అంటూ ఆమెను బాలయ్య స్టేజి మీదకు పిలిచేసరికి ఆమె కూడా మంచి ఎనెర్జీతో రెడ్ కలర్ డ్రెస్ లో డాన్స్ చేస్తూ వచ్చేసింది. "హాయి హాయి హాయే హాయి" అనే సాంగ్ ని చాలా స్టైలిష్ గా మంచి ఎనెర్జీతో పాడి వినిపించింది. "జనరల్ గా చెప్పాలంటే హై నోట్స్ పాడేటప్పుడు కొన్నిచోట్ల హర్ట్ ఐపోతుంది...కానీ నీ హై నోట్స్ మాత్రం ఫ్లాటి" అంటూ థమన్ వెరైటీగా ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసరికి బాలయ్య గట్టిగా అరిచారు.

"శృతి అమేజింగ్ పెర్ఫార్మెన్స్" అని కార్తిక్ కూడా చెప్పేసరికి ముగ్గురు జడ్జెస్ బాలయ్య అంతా కలిసి ఒకే శృతిలో బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఆమె పెర్ఫార్మెన్స్ ని మెచ్చుకున్నారు. ఇక బాలయ్య ఎక్కడుంటే అక్కడ ఎనెర్జీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కంటెస్టెంట్స్ లో ఉత్సాహం రేకెత్తించడానికి చాలా డౌన్ అవుతారు కొన్ని సందర్భాల్లో..ఇక ఇప్పుడు కూడా ఆయన శృతి పాటకు ఫిదా ఐపోయి స్టేజి మీదకు వచ్చి ఆమెతో కలిసి అదే పాటకు డాన్స్ చేసి అలరించారు. ఇక నెటిజన్స్ ఐతే బాలయ్యను తమ పొగడ్తల మెసేజెస్ తో ముంచెత్తారు. వీరసింహా రెడ్డి మూవీతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎన్‌బీకే 108లో నటిస్తున్నాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.