English | Telugu
తిలోత్తమతో ఆడుకుంటున్న నయని!
Updated : Jul 23, 2022
అషికా గోపాల్, చందూ గౌడ ప్రధాన జంటగా నటించిన సీరియల్ `త్రినయని`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. రాత్రి 8:30 గంటలకు ప్రసారం అవుతూ థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంతం ఆసక్తికర మలుపులతో సాగుతోంది. ఇందులోని ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, భావనా రెడ్డి, విష్ణుప్రియ, ద్వారకేష్ నాయుడు, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, శ్రీసత్య తదితరులు నటించారు.
విశాల్, నయని 50 కోట్ల షూ కాంట్రాక్ట్ ని తిలోత్తమ కుట్ర కారణంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కావాలనే డీల్ రోజు విశాల్ షూలో ఎలర్జీ పౌడర్ చల్లడంతో విశాల్ షూస్ ని మీటింగ్ జరుగుతుండగానే కాళ్లతో తన్నేస్తాడు. ఇది గమనించిన ఇతర కంపనీ వాళ్లు అర్థ్రాంతరంగా డీల్ ని క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోతారు. ఈ విషయాన్ని సీరియల్ గా తీసుకున్న నయని.. తిలోత్తమకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్లాన్ చేస్తుంది. తిలోత్తమ వేసుకున్న కొత్త చెప్పులు కాళ్లకే ఫిక్సయ్యేలా చేస్తుంది. దీంతో వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక తిలోత్తమ అవస్థలు పడుతూ వుంటుంది.
ఇదే మంచి అదనుగా భావించిన నయని సలసల కాగే నీళ్లలో తిలోత్తమ కాళ్లు పెట్టించి తిలోత్తమ తిక్క కుదురుస్తుంది. ఒక్క సారిగా కాళ్లు మంటెక్కిపోవడంతో టాప్ లేచేలా తిలోత్తమ అరుస్తుంది. ఆ తరువాత కాళ్లకున్న చెప్పులు వీడి పోవడంతో తనని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెడుతుంది. ఇది నీకుట్రేనని నాకు తెలుసని తిలోత్తమ అనడంతో ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే అని నయని చెబుతుంది. ఆ తరువాత తిలోత్తమని ఆడుకోవడం మొదలు పెడుతుంది. గాయత్రీ దేవి, భూషణ్, సుధ అంటూ ముగ్గురు పిల్లలతో ఆత్మల్లా నాటకం మొదలు పెడుతుంది. అది చూసిన తిలోత్తమలో వణుకు మొదలవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది?.. అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.