English | Telugu

విష్ణుప్రియకు నయని పావని గైడెన్స్.. ఛీఫ్ గా గెలవాలనే జీల్ లేదంట!

ఇదెక్కడి మాస్ రా మామ.‌. అన్నట్టుగా ఎవరైన నామినేషన్ లో తమ తప్పు చెప్తే డిఫెండ్ చేసుకోవాలి కానీ మన అడల్ట్ రిలేటెడ్ జోక్స్ ముద్దుబిడ్డ ప్రేక్షకుల గారాల పట్టీ విష్ణుప్రియ తన నత్తి బ్రెయిన్ ని మరోసారి ఋజువు చేసుకుంది.

అసలేం జరిగిందంటే.. నిన్న వైల్డ్ కార్డ్స్ అందరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పగా.. మొదటగా విష్ణుప్రియని నయని పావని నామినేట్ చేసింది. అసలు నువ్వు హౌస్ లో ఎందుకున్నావ్.. ఓ టాస్క్ ఆడవు.. ఛీఫ్ అవ్వాలనే జీల్ లేదు.. కానీ ఇన్ని వారాల నుండి ఎవరో ఒకరి వెనక తిరుగుతు ఎందుకు ఇలా ఉన్నావ్.. నీకు సీరియస్ నెస్ అస్సలు లేదు.. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతి టాస్కు ముఖ్యం.. అది మిస్ అయితే నువ్వు ప్రూ చేసుకునే ఛాన్స్ ఒకటి మిస్ అయినట్లే.. కానీ నువ్వు ఈ వారం నాకు చీఫ్ అవ్వాలని లేదు.. ఆరో వారం అవుతానంటూ చెప్తున్నావ్.. అలా అప్పుడు నీకు ఛాన్స్ రాకపోవచ్చు.. ఈలోపే వెళ్లిపోవచ్చు.. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు.. నీ బదులు ఎంతమంది ట్యాలెంటెడ్ పీపుల్స్ బయట ఉన్నారు. మీ బదులు వారొస్తే బాగుండేదని మీ ఆటతీరు చూస్తే అర్తమైందని నయని పావని అనగా.. ఇది నా ఆట.. నా లైఫ్‌లో సీరియస్‌నెస్ లేదు.. నాకు ఏది కావాలో అదే సీరియస్‌గా తీసుకుంటా.. అందుకే నా కెరీర్‌లో ఇంతవరకు పైకి వచ్చా.. నాలో ఏదో ఉందనే ఈ షో వాళ్లు నన్ను పిలిచారు.. ఇక చీఫ్ టాస్కుకి నేను ఇంట్రెస్ట్ లేదు అన్నా.. ఎందుకంటే రెడీగా లేకుండా నేను అయిపోతా అని గొప్పలు చెప్పడం నాకు ఇష్టం లేదు.. ఇక ఈ షోను అర్థం చేసుకోవడానికే నాకు కాస్త టైమ్ కావాలంటూ విష్ణుప్రియ అంది.

సెకండ్ సీతని నామినేట్ చేసింది నయని. మీరు చీఫ్ అయిన తర్వాత మీ గేమ్ ఎక్కువ కనిపించలేదు.. అంతకుముందు చాలా ఫైర్ ఉండేది.. కానీ చీఫ్ అయ్యాక ఏ గేమ్‌లోనూ ముందుకు రాలేదు మీరు.. అలానే మీరు నామినేట్ చేసినప్పుడు వాళ్లు బయటికి వెళ్లిపోతారని మీకు తెలుసు కదా.. మరి మీరే నామినేట్ చేసి మీరే ఏడవటం ఎందుకు.. అలానే నిన్న మేము ఎంట్రీ ఇచ్చినప్పుడు.. అందరు బాగా వెల్ కమ్ చెప్పారు.. కానీ మీరు కనీసం నవ్వలేదంటూ నయని అంది. ఇది కాస్త సిల్లీగా అనిపించింది కానీ హౌస్ లో వారి బిహేవియర్ అనేది దగ్గరుండి చూసినవాళ్ళకే తెలుస్తుంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.