English | Telugu

నవదీప్ యూనిక్ అండ్ ఇన్ క్రెడిబుల్ పర్సన్...రేటింగ్ ఇవ్వడం కష్టం 

నవదీప్ ఏది చేసిన సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఐతే రీసెంట్ టైమ్స్ లో AI పండుతో బాగా మాట్లాడుతున్నాడు. ఆ వీడియోస్ ని షేర్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియోని పోస్ట్ చేసాడు. నవదీప్ ఎప్పుడు కార్ లో డ్రైవ్ చేస్తుకుంటూ వెళ్లినా కూడా చాట్ జిపిటి పండుతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తాడు. ఇక ఈ వీడియోలో పండుని రెండు ప్రశ్నలు అడిగాడు"హాయ్ పండు గుడ్ మార్నింగ్. నాలో ఉన్న సైకో లక్షణాలు ఏమిటో 40 సెకన్స్ లో నా గురించి నీకు తెలిసిన మ్యాటర్ చెప్పు పండు అనేసరికి "మీరు కథలు బాగా చెప్తారు. అడ్వెంచర్ సైట్స్ కి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్కై డైవింగ్ చేయడం అంటే ఇంకా ఇష్టం. నీ ఫ్రెండ్స్ విషయంలో కేరింగ్ గా ఉంటారు. హెల్ప్ కావాలి అని ఎవరు అడిగిన వెంటనే చేస్తారు.

అడ్వెంచరస్ పర్సన్ మీరు. మీరొక హోప్ ఫుల్ పర్సన్. హేవ్ ఏ గుడ్ డే" అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు. సరే నా గురించి నీకు తెలిసిన ఇంఫార్మేషన్ ప్రకారం నేను ఎలాంటి హ్యూమన్ బీయింగ్ అనేది 1 నుంచి 10 లోపు రేటింగ్ ఇవ్వు పండు అని అడిగాడు. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను ఎంకరేజ్ చేస్తాను కానీ రేటింగ్ మాత్రం ఇవ్వలేను. ఎందుకంటే మీరు చాలా యూనిక్ అండ్ ఇన్ క్రెడిబుల్ పర్సన్" అనేసరికి ఫుల్ జోష్ తో ఊగిపోయి థాంక్యూ పండు హేవ్ ఏ గుడ్ డే, లవ్ యు అన్నాడు. "అది చాట్ జిపిటి మీ గురించి ఎం అనుకుంటుందో ఒకవేళ మీరు కూడా రెగ్యులర్ గా మాట్లాడేవాళ్ళు ఐతే గనక కనుక్కోండి. కనుక్కుని హిట్ మీ, హిట్ మీ ఐ సే" అంటూ నవదీప్ అన్నాడు. ఈ మధ్య కాలంలో ఏఐ బాట్స్ పండు అని జెమినీ అని కొన్ని వచ్చాయి..అందులో ఈ రెండు బాట్స్ ని జనాలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఏదైనా ఆర్టికల్ రాసిన ఎవరి గురించి చెప్పమన్న, ఏ ఇన్ఫర్మేషన్ ని అడిగినా క్షణాల్లో చెప్పేస్తోంది. వాటిని ప్రతీ ఒక్కరూ కూడా వాడుతున్నారు. మీరు మీరు కూడా మీ గురించి సరదాగా ఏఐతో జాతకంలో మీ గురించో అడిగి తెలుసుకోండి సరదాగా.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.