English | Telugu
జబర్దస్త్ లోకి నాటీ నరేష్ నాన్న.. సెలబ్రిటీని చేయడానికే!
Updated : Nov 27, 2022
జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన కామెడీ షో. టాలెంట్ ఉన్న వాళ్ళను ప్రోత్సహించే రియాలిటీ షో. ఇక ఈ జబర్దస్త్ ద్వారా ఎంతో మంది స్టార్స్ కూడా అయ్యారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ఐతే ఇలాంటి వేదిక మీదకు తమ పిల్లల్ని పంపి ఎంతో ప్రోత్సహిస్తున్న తల్లితండ్రుల్ని కూడా మల్లెమాల టీమ్ ఆడియన్స్ కి పరిచయం చేస్తూ ఉంటుంది. బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న కూడా అలాగే ఈ స్టేజి మీద ఎన్నో స్కిట్స్ వేసాడు. ఇక లేటెస్ట్ గా జబర్దస్త్ నాటీ నరేష్ తన తండ్రిని కూడా స్టేజ్ పైకి తీసుకొచ్చి స్కిట్ చేయించాడు.
గతంలో నరేష్.. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో తన తండ్రిని పరిచయం చేసాడు. అయితే ఆ టైములో ఎలాంటి స్కిట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ లో నరేష్ తండ్రి ఒక స్కిట్ లో నటించారు. ఈ స్కిట్ లో తన తండ్రి మీదే నాటీ నరేష్ పంచులు బాగా వేశాడు. అయితే నరేష్ తండ్రికి ఈ స్కిట్స్ అవి కొత్త కావడం వలన ఆయన డైలాగ్స్ చెప్పకుండా.. ఎక్స్ ప్రెషన్స్ తోనే స్కిట్ ని రక్తి కట్టించారు. కెవ్వు కార్తీక్ "నన్ను ఇక్కడ నుంచి పంపించేయండి" అంటే.. నరేష్ తండ్రి.. "రైట్ రైట్" అని అంటాడు. దానికి నరేష్.. "నాన్న నిన్ను సెలబ్రిటీని చేద్దామనుకుంటున్నాను. ఇంకా నువ్వు రైట్ రైట్ అనుకుంటానే ఉన్నావ్" అంటూ పంచ్ డైలాగ్ వేసేసరికి నరేష్ వాళ్ళ నాన్న ఏం అనాలో తెలియక సైలెంట్ గా ఉంటాడు.