English | Telugu

సోనియా, నిఖిల్ కి నాగార్జున మాస్ వార్నింగ్.. మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం?

బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో.. ఈ వారమంతా బిగ్ బాస్ చూసిన ఆడియన్స్ ఏం అనుకున్నారో.. నాగార్జున ఎవరిని ఏం అన్నాడో చూద్దాం. (Bigg Boss 8 Telugu)

నిఖిల్, సోనియా, పృథ్వీ ముగ్గురికి ఇచ్చిపడేశాడు నాగార్జున. అసలేం జరిగిందంటే.. హౌస్ లో హీరో ఎవరు? జీరో ఎవరో చెప్పమని ప్రేరణని నాగార్జున అడుగగా.. నబీల్‌ తన హీరో అని చెప్పింది ప్రేరణ.. వాడిలో చాలా ఫన్, ఎమోషన్ ఉంది.. ఒక మంచి హ్యూమన్ బీయింగ్.. లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటూ నబీల్ గురించి ప్రేరణ అంది. ఇక తన వరకూ జీరో నిఖిల్ అని ప్రేరణ చెప్పింది. అసలు నిఖిల్ పప్పులా ఆడుతున్నాడా లేక అతని స్ట్రాటజీనా అనేది తెలీడం లేదని ప్రేరణ అంది‌. తనకి ఓ క్లారిటీ లేదు.. వైల్డ్ కార్డ్ రాకూడదని.. అందరు యునైటెడ్‌గా ఆడాలని మాతో చెప్పాడు.. కానీ తర్వాత తన క్లాన్ మంచి కోసం అంటూ నబీల్‌ను తీసేశాడంటు ప్రేరణ చెప్పింది. దీంతో నిఖిల్‌ను నాగార్జున అడుగగా... ఏంటి నాన్న ఎందుకలా చేశావ్.. నబీల్‌ను తీసేయడం కరెక్ట్ డెసిషనా అంటూ అడగ్గా నిఖిల్ ఏదో చెప్పాడు. అది నాగ్‌తో పాటు ఎవరికి పెద్దగా కరెక్ట్ అనిపించలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపాలంటే స్ట్రాంగ్‌‌గా ఆడాలి కదా.. బిగ్‌బాస్ అన్ ఫిట్ వాళ్లని తీయాలన్నాడు. నువ్వెవరిని తీశావంటూ నాగార్జున ప్రశ్నించగా... దీనికి మిస్ బ్యాలెన్స్ అయింది సర్ కొంచెం అంటూ నిఖిల్ అన్నాడు‌. ఆ మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణమంటూ నాగార్జున అడిగాడు. ఇక మధ్యలో సీత కూడా లేచి నిఖిల్‌ గురించి కొన్ని మాటలు చెప్పింది. మొసట్లో నిఖిల్ చాలా కాంపిటేటివ్ అనుకున్నాను.. కానీ ఈజీగా ఫ్లిప్ అయిపోయినట్లు అనిపించింది.. అయిన వాళ్లు ముగ్గురూ కలిసే ఆడుతున్నారు.. నామినేషన్స్‌లో కూడా సోనియా తరపున వీళ్లు మాట్లాడుతున్నారంటూ సీత చెప్పింది. దీంతో నిఖిల్‌కి క్లాస్ పీకాడు నాగార్జున. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మాట చెప్తున్నావ్.. అది టెంపరెరీగా ఉపయోగపడుతుంది.. కానీ నీ ముందు ఎలా పిలిచినా నువ్వు లేనప్పుడు మాత్రం నిన్ను నారద అని పిలుస్తారంటూ నాగార్జున అన్నాడు. అందుకే నువ్వు చీఫ్‌గా ఉన్న ఆ క్లాన్‌కి ఎవరూ రావడానికి ఇష్టపడలేదంటూ నాగార్జున అన్నాడు

ఇక ఆ తర్వాత సోనియాను లేపి ప్రశ్నించాడు నాగార్జున. సోనియా.. విష్ణు నిన్ను నిఖిల్ విషయంలో ఏదో అన్నప్పుడు అడల్ట్ రేటెడ్ కామెడీ అన్నావ్.. మరి నువ్వు చేసిందేంటంటూ యష్మీ గురించి నామినేషన్స్‌లో సోనియా అన్న వీడియోను ప్లే చేశి చూపించాడు నాగార్జున. ఇక్కడ నిఖిల్-పృథ్వీలను చూడటం మానేసి నన్ను చూస్తే తెలుస్తుందంటూ సోనియా అంది. దీన్నే దాని అర్థమేంటని నాగార్జున అడుగగా.. అది నిఖిల్ కూడా తప్పుగానే తీసుకున్నాడు సర్.. ఆరోజు నా హార్ట్ బ్రోక్ చేశాడు.. నా ఉద్దేశం అంది కాదంటూ సోనియా అంది. దీంతో ఆ మాట సోనియా అనడం రైటా అంటూ నిఖిల్-పృథ్వీలను లేపి నాగార్జున అడిగాడు. అప్పుడు కూడా లేదు సర్.. తన ఉద్దేశం అది కాదు మాకు తర్వాత క్లారిటీ ఇచ్చిందంటూ సోనియాకి పెద్దోడు-చిన్నోడు ఇద్దరు సపోర్ట్ చేశారు. దీంతో నాగార్జునకి కోపం వచ్చింది‌.

అక్కడ వీడియోలో క్లియర్ గా ఉంది కదా.. కళ్లతో చూసింది నమ్ముతారా.. తను చెప్పింది వింటారా అంటు నిఖిల్, పృథ్వీలని నాగార్జున అడుగగా.. అది కాదని వాళ్ళిద్దరు అన్నారు. ఇదంతా చూసి ఒళ్లు మండిన ప్రేరణ.. దీని వల్లే ఎవరు ఆ క్లాన్‌కి వెళ్లలేదు.. ఎవరు ఎంతలా చెప్పినా.. క్లియర్‌గా కనిపించినా దాన్ని కూడా కవర్ చేసి, ముగ్గురూ నీటిగా ప్రొటెక్ట్ అయి కూర్చోవడం వాళ్లకి అలవాటు అంటూ ప్రేరణ అంది. దీనికి ముగ్గురు కాదు కాదు అంటూ అనండతో నాగార్జున మాట్లాడాడు. విష్ణు..ఏం అనకుండానే అడల్ట్ రేటింగ్ అన్న నువ్వు, ఇది కూడా కరెక్ట్‌గా మాట్లాడాలి కదా అంటూ నాగార్జున అన్నాడు. ఇక మీ ఇష్టం.. మీ ఆటని మీరే నాశనం చేస్కోండి అంటు నిఖిల్, పృథ్వీలకి నాగార్జున చెప్పడంతో ఇద్దరు కూర్చున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.