English | Telugu
రవితేజా! నువ్వు ఫ్లర్టింగ్‌లో మాస్టర్‌వి!!
Updated : Dec 19, 2022
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగింపు వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇందులో సెలబ్రిటీల రాకతో బిగ్ బాస్ స్టేజ్ దద్దరిల్లిపోయింది.హోస్ట్ నాగార్జున మంచి మాస్ బీట్ సాంగ్ తో స్టేజ్ మీదకు వచ్చేసాడు. వచ్చి రాగానే టాప్-5 కంటెస్టెంట్స్ కి కంగ్రాట్స్ చెప్పి ఉత్సాహపరిచాడు.
ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీల వచ్చారు. ఇక వీరిదద్దరు కలిసి నటించిన 'ధమాక' మూవీ గురించి ప్రమోషన్స్ చేసారు. తర్వాత "నాగార్జున నాకు ఫస్ట్ చెక్ ఇచ్చారు. దానిని దాచుకుందామనుకున్నా కానీ అవసరం ఉండి వాడేసాను" అని చెప్పాడు రవితేజ.
ఆ తర్వాత రవితేజని, హౌస్ మేట్స్ తో మాట్లాడించాడు నాగార్జున. ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చాడు. నాగార్జున మాట్లాడుతూ, "ఆదిరెడ్డి పక్కన ఉన్నది శ్రీహాన్. అతను ఫ్లర్టింగ్ లో కింగ్" అని అనేసరికి.. "సర్..!" అని శ్రీహాన్ ఆశ్చర్యపోగా, "హే సర్ ఏంటి..గుడ్ గుడ్.. ఎంత వీలైతే అంత చేసేయ్" అని రవితేజ అన్నాడు. ఇది విని నాగార్జున "ఆ స్కూల్లో రవి మాస్టర్" అని అనగా, "మీరు తక్కువ బాగా.. మీకేం తెలియదు పాపం" అంటూ రవితేజ నాగార్జునని అనేసరికి నాగార్జున నవ్వేసాడు.