English | Telugu
Nagarjuna Fires on Yashmi : మదర్ ప్రామిస్.. నేను ఆ ఉద్దేశంతో అనలేదు!
Updated : Sep 29, 2024
బిగ్ బాస్ హౌస్ లో శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున ఎవరికి క్లాస్ పీకుతాని ఆడియన్స్ అనుకున్నారో అదే జరిగింది. హౌస్ లో పర్ఫామెన్స్ వైజ్ నబీల్ ది బెస్ట్ అని తేలింది. ఇక నాగ మణికంఠ, నిఖిల్, సోనియా పెద్దగా ఆడటం లేదని నాగార్జున చెప్పేశాడు. (Bigg Boss 8 Telugu)
మొన్న టాస్క్ జరిగిన తర్వాత మణికంఠని ఉద్దేశించి.. అతను మగాడు కాదంటూ యష్మీ చేసిన వ్యాఖ్యలని నాగార్జున తిడతాడని, క్లాస్ పీకుతాడని తెలుగువన్ ఇంతకముందే చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో యష్మీని నాగార్జున నిల్చోబెట్టి.. హౌస్ లో ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారని అడుగగా.. ఏమీ తెలియనట్టు మొహం పెట్టి నలుగురు బాయ్స్, అయిదుగురు గర్ల్స్ అని యష్మీ అంది. ఇక నాగార్జున వీడియో ప్లే చేసి చూపించాడు.ఈ వీడియోలో ఏం ఉందంటే.. మణికంఠ దూరంగా కూర్చొని ఉంటే యష్మీ సహా తొట్టి గ్యాంగ్ అంతా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. అందులో హౌస్‌లో ఎంతమంది మగాళ్లున్నారని ఎవరో అడిగితే నలుగురే అంటూ ఇంకెవరో అన్నారు. అదేంటి మణికంఠను లెక్కపెట్టలేదా అని పృథ్వీ అంటే వాడు లెక్కల్లో లేడంటూ యష్మీ డైలాగ్ వేసింది. దీన్ని కొనసాగిస్తూ రేయ్ నిన్ను మగాళ్ల లిస్ట్‌లోనే వేయట్లేదంటూ నిఖిల్ ఇంకా గట్టిగా చెప్పాడు.
ఇక ఈ వీడియో చూసిన వెంటనే యష్మీ.. మదర్ ప్రామిస్ సర్.. నేను ఆ ఇంటెన్షన్ తో అనలేదు.. నా ఇంటెన్షన్ అయితే అది కాదు.. ఐయామ్ సారీ మణికంఠ.. నా గురించి నీకు తెలుసు.. సారీ మణి అంటూ యష్మీ అంది. దీంతో మణికంఠను పైకి లేపి నాగ్ అడిగారు. యష్మీ అన్న మాట నీకు ఎలా అనిపించిందని నాగ్ అడిగితే.. అది ఒక జోకులా అనిపించింది సర్.. అందుకే వెంటనే రియాక్ట్ అయి మీ హద్దుల్లో మీరుండండి అన్నా అంటూ మణికంఠ చెప్పాడు. మరి నువ్వు ఎందుకు రెయిజ్ చేయలేదు.. నీ వాయిస్ ఎందుకు గట్టిగా వినిపించలేదంటూ నాగార్జున అడిగాడు. అంటే వీళ్లకి చెప్పిన వేస్ట్.. వీళ్ల జ్ఞానం ఇంతే అని వదిలేశా అంటూ మణికంఠ అన్నాడు. దీనికి నాగార్జున సీరియస్ అయ్యాడు. స్టాండ్ తీసుకో మణి, నిన్ను ఎవరైనా ఏదైనా అంటే మాట్లాడు.. నువ్వు ఏమనవనే వాళ్లు జోక్స్ వేస్తున్నారంటూ నాగార్జున క్లాస్ పీకాడు.