English | Telugu

ప్రియాంక కోసం ఆడుతున్నావంటూ అమర్ దీప్ పై నాగార్జున ఫైర్!

బిగ్ బాస్ సీజన్-7.. ది బెస్ట్ టీఆర్పీతో దూసుకెళ్తుంది. గత సీజన్ కంటే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఢిఫరెంట్ గా ఉండడంతో పాటు పర్ఫామెన్స్ లో ఎవరూ తగ్గట్లేదు. నేనంటే నేను ఎక్కువగా అరుస్తానంటూ నోరేసుకొని పడిపోతున్నారు ఈ సీజన్ కంటెస్టెంట్స్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శనివారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఒక ఆట ఆడుకున్నాడు నాగార్జున. ప్రతీ వారం లాగే కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ని తెలియజేశాడు. వారికి తమ తప్పొఒప్పులని చెప్తూ రూల్స్ ని స్పష్టంగా వినాలని, ఫాలో అవ్వాలని చెప్పాడు నాగార్జున.

మూడవ వారం, మూడవ హౌజ్ మేట్ కోసం జరిగిన బుల్ రైడ్ టాస్క్ లో ప్రియాంక జైన్ మీద శోభా శెట్టి పన్నెండు సెకండ్ల తేడాతో‌ గెలిచిందని నాగార్జున తనని అభినందించాడు. ఇక ఆటలో‌ ముగ్గురు కలిసి వీకెస్ట్ కంటెస్టెంట్ ఎవరో వారిని టాస్క్ నుండి తప్పించమని బిగ్ బాస్ చెప్తే.. శోభా శెట్టి , ప్రియాంక జైన్ కలిసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ప్రిన్స్ యావర్ ని ఎలా తప్పిస్తారని నాగార్జున అన్నాడు. ఇక అమర్ దీప్ ని ప్రియాంక జైన్ గురించి అడిగి క్లాస్ పీకాడు. అసలు హౌజ్ లో సేఫ్ ప్లేయర్ ఎవరు? గేమ్ చేంజ్ ఎవరని ఒక్కో కంటెస్టెంట్ ని అడిగి తెలుసుకున్నాడు నాగార్జున.

అమర్ దీప్ కంటెండర్ కాకపోవడానికి రీజన్ ఏంటని ప్రియాంక జైన్ ని నాగార్జున అడిగాడు. తను లాస్ట్ గేమ్ లో ఓడిపోయాడు అందుకే తను వీక్ అని అతడిని అర్హుడు కాదని చెప్పానని ప్రియాంక జైన్ అంది. ఇక అది విని '' ఆమె డెసిషన్ కి నువ్వు అగ్రీ అయ్యావా అమర్ దీప్ " అని నాగార్జున అడుగగా.. లేదని, అదే విషయం తనకు చెప్పలేదని, ఒకసారి ఓడిపోతే గెలవలేమా ప్రతీసారీ చెప్పాలా, నేనేంటో ఆడి గెలిచి చూపిస్తానని అనుకొని ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయ్యానని అమర్ దీప్ అన్నాడు. అసలు నువ్వు నీకోసం ఆడుతున్నావా? ప్రియాంక జైన్ కోసం ఆడుతున్నావా? ఇదే మాట ప్రశాంత్ చెప్తే అతని మీద రేజ్ అయ్యావ్? ప్రియాంకని ఏం అనలేదని నాగార్జున అన్నాడు. దానికి అమర్ దీప్ సారీ సర్.. ఇక‌ నుండి నా ఆట నేను ఆడతాను సర్ అని అమర్ దీప్ అన్నాడు. నీ ఆట నువ్వు మాత్రమే ఆడు, ఎవరికోసమే వెనుకడుగు వేయోద్దని, సరిగ్గా ఆడమని అమర్ దీప్ తో నాగార్జున అన్నాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.