Read more!

English | Telugu

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ప్రియ రీఎంట్రీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ తాజాగా రెండొందల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ సీరియల్ లో మెయిన్ లీడ్స్ గా కృష్ణ పాత్రలో ప్రేరణ కంబం నటిస్తుండగా, మురారి పాత్రలో ముఖేష్ గౌడ  చేస్తున్నాడు. ముకుంద పాత్రలో  యశ్మి గౌడ నటిస్తోంది. కాగా మురారికి పెద్దమ్మగా భవాని పాత్రలో ప్రియ నటిస్తుంది.

ప్రియ.. అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ. ఈమె 1997 లో 'మాస్టర్'  సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2021 లో బిగ్ బాస్ సీజన్-5 లో కంటెస్టెంట్ గా పాల్గొంది.‌ సినిమాల్లోనే కాకుండా‌ సీరియల్స్ లో నటించింది ప్రియ. జెమినిలో 'శక్తి' సీరియల్‌‌ ద్వారా అరగ్రేంట్రం చేయగా, 'ప్రియసఖి' సీరియల్‌కు నంది అవార్డు అందుకుంది. ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించిన ప్రియ.. ఇప్పుడు తాజాగా స్టార్ మా టీవీలో‌ ప్రసారమవుతున్న  'కృష్ణ ముకుంద మురారి సీరియల్' లో ముఖ్య పాత్రని పోషిస్తుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎన్నో ట్విస్ట్ లతో రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. అయితే ఈ సీరియల్ లో మురారికి పెద్దమ్మగా భవానీ కొన్ని వారాల  క్రితం ఆశ్రమానికి వెళ్ళినట్టుగా‌ చూపించారు. అయితే అలా వెళ్లిన భవానీ.. ఇంకా తన క్యారెక్టర్ ఎంట్రీ రాకపోవడంతో ఈ సీరియల్ లో తన పాత్ర ముగిసిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ సీరియల్ చూస్తున్న అభిమానులు తన పాత్ర కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‌కాగా ఇప్పుడు తాజాగా తన సోషల్ మీడియాలో తను ఇండియాకి వచ్చేసినట్టు.‌. కృష్ణ ముకుంద మురారి సీరియల్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా ఆమె చెప్పింది. కాగా రానున్న ఎపిసోడ్‌ లలో భవాని పాత్రలో ప్రియ ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.