English | Telugu
అత్తాకోడళ్ళకు వాళ్ళ సేఫ్టీ గురించి చెప్పినా రుచించదు!
Updated : Mar 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -95 లో.. రేవతి దగ్గరికి ముకుంద వచ్చి.. "ఏంటి మీకు బాగోలేదు కదా.. కిచెన్ లోకి మీరెందుకు వచ్చారు" అని అడుగుతుంది. "లేదమ్మ నేను ఇప్పుడే వచ్చాను. బ్రేక్ ఫాస్ట్ మొత్తం కృష్ణనే రెడీ చేసింది" అని చెప్పి రేవతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణ కాలేజీకి లేట్ అవుతుందని హడావిడిగా వచ్చి టిఫిన్ చేసి మురారిని పిలుస్తుంది. మురారి కాకుండా అందరూ వస్తారు. "ఏంటి అలా అరుస్తున్నావ్" అని భవాని అనగానే.. "అత్తయ్య నాకు కాలేజీకి లేట్ అవుతుంది.. అందుకే ఏసీపి సర్ ని పిలుస్తున్నా" అని చెప్తుంది. అక్కడే ఉన్న ముకుంద.. నీకు కాలేజీకి లేట్ అయితే నువ్వు ఒక్కదానివే వెళ్ళు కృష్ణ. మురారి ఏమైనా క్యాబ్ డ్రైవరా.. నిన్ను డ్రాప్ చేసి, పిక్ చేసుకోవడానికి అని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ కాలేజీకి లేట్ అవుతుందని ఒక్కతే వెళ్తుంది. "ఏంటమ్మా ముకుంద.. ఎంత మురారి ఏసీపి అయినా వాళ్ళిద్దరూ భార్య భర్తలు. కృష్ణని కాలేజీకి తీసుకెళ్ళి తీసుకొస్తాడు. నువ్వు ఎందుకు అలా అంటున్నావ్" అని మురారి వాళ్ళ బాబాయ్ అంటాడు. దానికి ముకుంద సైలెంట్ గా ఉండిపోతుంది.
మరోవైపు రెడీ అయి వచ్చిన మురారి.. కృష్ణ ఒక్కతే వెళ్ళిపోయిందని తెలుసుకుంటాడు. ఒక్కతే ఎలా వెళ్ళిందని ఆలోచిస్తూ.. కృష్ణకి మురారి ఫోన్ చేస్తాడు. తను బిజీగా ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయదు. దాంతో మురారికి ఆలోచనలు ఎక్కువ అయిపోతాయి. ఇక స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ కానిస్టేబుల్ ఒక ఫైల్ తీసుకొచ్చి సంతకం చెయ్యండి సర్ అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ పెన్ ను తీసుకొని మురారి తన సంతకం బదులుగా కృష్ణ అని రాస్తాడు. అది చూసిన కానిస్టేబుల్.. "సర్.. మీరు కృష్ణ అని రాసారు" అని చెప్పడంతో ఈ ఫైల్ మార్చి ఇంకొక ఫైల్ తీసుకురమ్మని చెప్తాడు.
కాలేజీ అయిపోయాక కృష్ణ ఇంటికి వచ్చేసరికి చీకటి పడుతుంది. లేట్ గా వచ్చిన కృష్ణని చూసిన భవాని.. "ఎందుకు ఇంత లేట్ అయింది" అని అడుగుతుంది. కాలేజీలోనే లేట్ అయిందని కృష్ణ అనగానే.. క్యాబ్ బుక్ చేసుకొని త్వరగా రావాలని తెలియదా అని భవాని అంటుంది. పక్కనే ఉన్న ముకుంద.. కృష్ణ, రేవతిలను ఉద్దేశించి.. అత్తాకోడళ్ళకు వాళ్ళ సేఫ్టీ గురించి చెప్పినా రుచించదని భవానీతో అంటుంది. నన్ను భవాని అత్తయ్య అడిగింది.. ఆమెకు సమాధానం చెప్పాను కదా.. నీకెందుకు చెప్పాలని ముకుందకి కృష్ణ వార్నింగ్ ఇస్తుంది. సరే పెద్ద అత్తయ్య రేపటి నుండి త్వరగా వస్తానని చెప్పి కృష్ణ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.