Read more!

English | Telugu

మురారిని గదిలోకి లాక్కెళ్ళి ముద్దుపెట్టిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.. ఒకరి ప్రేమ, మరొకరి పంతం మధ్య నలిగిపోతున్న మురారి.. ప్రేమని గెలిపిస్తాడో లేక పంతాన్ని గెలిపిస్తాడో అనే ఆసక్తిని రేకెత్తిస్తూ రోజుకో మలుపుతో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సీరియల్ ఎపిసోడ్ -77 లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో... కృష్ణ బాధపడుతు ఒంటరిగా కూర్చుంటుంది. అప్పుడే తన దగ్గరికి వచ్చిన మురారి.. "ఏంటి అలా ఉన్నావ్" అని అడుగుతాడు. మీ అమ్మ నన్ను చదువుకోవద్దని చెప్పింది కదా.. అందుకే ఇలా ఉన్నానని కృష్ణ చెప్తుంది. నువ్వు ఏం బాధపడకు.. అమ్మ  అర్థం చేసుకుంటుందని మురారి అంటాడు. అంతలోనే అలేఖ్య వచ్చి.. "రేవతి అత్తయ్య మీ ఇద్దరిని పిలుస్తుంది" అని చెప్తుంది.  దాంతో ఇద్దరు రేవతి దగ్గరకి వెళ్తారు.

"ఏంటమ్మా పిలిచావ్?" అని మురారి అడుగుతాడు. కృష్ణ నువ్వు ఎంత వరకు చదువుకోవాలనుకుంటున్నావో అంతవరకు చదువుకో.. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని నేనే వెనక్కి తీసుకుంటున్నాను. మీ అమ్మనాన్నల కలని నిజం చెయ్యాలని ఎంత ఆరాటపడుతున్నావో మురారి నాకు అంత చెప్పాడని రేవతి అంటుంది. "నిజంగా చదువుకోవాలా అత్తయ్య"  అని కృష్ణ ఒకవైపు, "నిజమా అమ్మా" అని మురారి మరోవైపు అంటారు.  "మీ అమ్మనాన్నల కలని నిజం చేయు కృష్ణ.. నిన్ను చదువుకోవద్దని నిన్ను బాధపెట్టాను.. నన్ను క్షమించు" అని రేవతి అంటుంది. థాంక్స్ అత్తయ్య అని  కృష్ణ అనగానే.. ఆ థాంక్స్ నాకు కాదు నీ భర్త మురారికి చెప్పు అని రేవతి అంటుంది. ఆ తర్వాత మురారి చెయ్యి పట్టుకొని తన గదిలోకి పరుగెత్తుకుంటూ తీసుకుపోతుంది కృష్ణ. అది చూసిన ముకుంద.. "ఏంటీ అలా మురారిని లాక్కుపోతుంది" అని అనుకుంటుంది.

గదిలోకి తీసుకెళ్లిన కృష్ణ.. "థాంక్స్ ఏసీపి సర్.. నాకు చాలా  హ్యాపీగా ఉంది" అని హగ్ చేసుకొని చెంపపై ముద్దు పెడుతుంది. దాంతో మురారి ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి కృష్ణ ఒక్కసారిగా దూరంగా వచ్చి.. "మళ్ళీ థాంక్స్ సర్" అని చెప్తుంది. మరోవైపు ముకుంద టెన్షన్ పడుతుంది. "కృష్ణ లోపలికి ఎందుకు లాక్కొని వెళ్ళింది" అని అనుకుంటూ మురారికి మెసెజ్ చేస్తూనే ఉంటుంది. "ఏంటీ సర్ ఈ మెసెజ్ లు" అని కృష్ణ అడుగగా.. "డీజీపీ సర్ చేశారు" అని మురారి కవర్ చేస్తాడు‌. "ఏసిపి సర్ నాకు చాలా సంతోషంగా ఉంది. మనం బయటికి వెళ్దాం.. మీకు పార్టీ ఇస్తాను" అని కృష్ణ అనగానే.. సరేనని చెప్తాడు.

మురారి, ముకుంద దగ్గరికి వచ్చి.. "ఏంటి ముకుందా" అని అంటాడు. "ఇంట్లో ఏం జరుగుతుంది మురారి.. కృష్ణ ఏంటి ప్రేమపక్షిలా నిన్ను లాక్కొని వెళ్తుంది" అని ముకుంద అడుగుతుంది. నువ్వు కోరుకున్నట్లే కృష్ణ చదువుకోవడానికి అమ్మ ఒప్పుకుందని మురారి అంటాడు. అప్పుడు ఎందుకు వద్దు అంది.. ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంది.‌. నాకు అర్థమైంది.. మన గురించి మీ అమ్మకి తెలిసిందని నీకు ఎప్పుడు అనిపించలేదా? అని ముకుంద అడిగేసరికి.. "నాక్కూడా అనిపించింది" అని మురారి అంటాడు.  "అప్పుడు కృష్ణ దూరంగా వెళ్తే నేను నీకు దగ్గర అవుతానని చదువువద్దు అని చెప్పింది. ఇప్పుడు ఆదర్శ్ వస్తున్నాడని చదువుకొమ్మని చెప్తుంది" అని రేవతి అనగా.. అదేం లేదని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.