English | Telugu

ఆదర్శ్ ఆచూకి కోసం వ్రతం చేయనున్న కృష్ణ, మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ - 71 లో అడుగుపెట్టింది. రోజుకో ట్విస్ట్ తో సినిమాని తలపిస్తున్న ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో.. ఆదర్శ్ గురించి కుటుంబసభ్యులు అంతా చర్చించుకుంటారు. పోలీసులచేత వెతికిస్తే సరిపోదు.. మనం దగ్గరుండి ఎక్కడికి దాకా వచ్చిందని గమనిస్తూ ఉండాలని కృష్ణ చెప్పగా.. "నీకే తెలుసు అనుకుంటున్నావా ఇంట్లో ఇంతమంది ఉన్నారు వారికి తెలియదా.. వాళ్ళంతా ఎప్పటినుంచో వెతికిస్తూనే ఉన్నారని రేవతి కోప్పడుతుంది. పక్కనే ఉన్న భవానీ రేవతిపై కోప్పడుతుంది. అడవిపిల్ల అయినా కరెక్ట్ గా మాట్లాడింది. వెతకండి అని చెప్పడం వేరు.. మనం దగ్గర ఉండి గమనించడం వేరు.. మొదటిది ఆల్రెడీ చేశాం.. రెండవది చేయడం మర్చిపోయాం" అని భవానీ అంటుంది.

భవానీ కుటుంబం పంతులుని పిలిపిస్తుంది. ఆదర్శ్ తిరిగిరావాలంటే సౌభాగ్యవతి వ్రతం చేపించాలి. ఆ వ్రతాన్ని ఇద్దరు దంపతులు కలిసి చేపించాలని పంతులు చెప్తాడు. వెళ్ళేముందు భవానీకి ఒక చీరని ఇస్తాడు పంతులు. "అష్టలక్ష్మీ అమ్మవారి గుడిలో పూజలో ఉంచిన చీర ఇది. వ్రతంలో కూర్చొనే దంపతులు ఈ చీరని కట్టుకొని పూజ చేయాలి" అని పంతులు చెప్పేసి వెళ్తాడు.

ఆ తర్వాత పూజలో ఎవరు కూర్చుంటారనే సంభాషణలో కృష్ణ, మురారి కలిసి పూజలో కూర్చుంటారని భవానీ చెప్పింది. పూజ ఫలిస్తుందా? లేదా? ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.