Read more!

English | Telugu

అగ్రిమెంట్ మ్యారేజే అయినా మన మధ్యలో ఏ బంధం లేదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -115 లో.. కృష్ణ నువ్వు వెళ్ళొద్దని మురారి అంటాడు. ఈ ఇంట్లో నిబంధనలు అన్ని కూడా ఇంట్లో వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే ఎవరి వ్యక్తిత్వాన్ని తక్కువ చెయ్యడానికి కాదని మురారి అంటాడు. నేను ఇంట్లో వాళ్ళ గురించి అనట్లేదు.. నీ గురించి అంటున్నాను. నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడావ్ నువ్వు. నీది నాది ఒక అగ్రిమెంట్ మ్యారేజ్ మాత్రమే అని  కృష్ణ అంటుంది. అగ్రిమెంట్ మ్యారేజే కానీ నాకు బాధ కలిగితే నువ్వు బాధపడ్డావ్.. నీకు బాధ కలిగితే నేను బాధపడ్డాను. మన మధ్యలో ఏ బంధం లేదా కృష్ణ అని మురారి అంటాడు. అగ్రిమెంట్ పూర్తికాకుండానే వెళ్తున్నాను అని కృష్ణ కిందకి వస్తుంది. 

కృష్ణ వెళ్ళిపోవడానికి సిద్దమవుతుంది. అది చూసి ఇంట్లో తనని ఎవరు ఆపేవారు లేరని ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలోనే కృష్ణ తన బ్యాగ్ తో కిందకి వస్తుంది. అందరూ హాల్లోనే ఉంటారు. రేవతి దగ్గరికి కృష్ణ వెళ్తుంది. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నన్ను కూతురులా చూసుకున్నారని రేవతిని పట్టుకొని ఏడుస్తుంది. తన దగ్గర ఆశీర్వాదం తీసుకొని భవాని దగ్గరికి వెళ్ళి.. మీ వల్లే ఈ ఇల్లు క్రమశిక్షణలో ఉంది.. మీరంటే నాకు గౌరవం ఉందని చెప్పి, ఆశీర్వదించండని కృష్ణ అంటుంది. కృష్ణని ఆశీర్వదించాలని అనుకొని ఆగిపోతుంది భవాని. నువ్వు వెళ్ళొద్దు కృష్ణ అని ప్రసాద్ అంటాడు. సుమలత చీర తీసుకొని వచ్చి కృష్ణకి ఇస్తుంది. వెళ్ళిపోతున్న కోడలిని కూడా మర్యాదగా పంపిస్తున్న ఈ ఇంటి సంస్కారం ఎంత గొప్పదో అని కృష్ణ అంటుంది. "నువ్వు వెళ్ళకు కృష్ణ.. ఈ ఇంట్లోని వారందరి తరుపున నేను క్షమాపణ అడుగుతున్నా" అని మురారి అంటాడు. నువ్వు ఒక గొప్ప ఏసీపీవి అయ్యి ఉండి, అలా అంటున్నవేంటని ముకుంద అనగానే.. "నేను ఎంత గొప్ప ఏసీపీ అయినా కూడా ఒక భార్యకి భర్తను.. అయినా భార్యాభర్తల బంధం గురించి నీకు తెలియడానికి ఆదర్శ్ లేడు కదా" అని మురారి అనగానే ముకుంద సైలెంట్ అవుతుంది.

ఆ తర్వాత కృష్ణ ఇంట్లో నుండి వెళ్లిపోతుంటే.. తప్పు చేసింది కాబట్టే వెళ్తుందని భవాని అనగానే.. కృష్ణ వెనక్కి వస్తుంది. నేను ఏ తప్పు చెయ్యలేదు.. ఎక్కడికి వెళ్ళను అని కృష్ణ అనగానే.. రేవతి, మురారి ఇద్దరు సంతోషపడతారు. ముకుంద మాత్రం డల్ అయిపోతుంది.‌ ఇంట్లో వాళ్ళందరూ హాల్ నుండి వెళ్ళిపోతారు. మురారిని బ్యాగ్ తీసుకొని రా అని కృష్ణ అంటుంది. అప్పుడు మురారి హ్యాపీగా ఫీలవుతూ సరేనని చెప్తాడు. కాసేపటికి నందు దగ్గరికి వెళ్తుంది కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.