English | Telugu

కాలేజీ పరువుపోకుండా కాపాడిన రిషి.. రాజీనామా చేసిన ధర్మరాజు!

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -721 లో.. ధర్మరాజు సడన్ గా డోర్ తియ్యడంతో రిషి కర్టెన్ వెనకాల దాక్కుంటాడు.. వసుధార మాత్రం ధర్మరాజు ముందే ఉండిపోవడంతో ధర్మరాజు చూసేస్తాడు. వసుధారని చుసిన ధర్మరాజు.. కలా? నిజామా అని అనుకుంటూ కళ్ళు నులుముకుంటుండగా వసుధారని వెనక్కి లాగుతాడు రిషి. ఇక కళ్ళు తెరిచి చూసిన ధర్మరాజు.. ఒహ్హ్ ఇది కలనా అని అనుకొని.. సోఫా దగ్గరికి వెళ్లి పడుకుంటాడు. వసుధార రిషి ఇద్దరు గదిలో నుండి బయటకు వచ్చి సోఫాలో ఉన్న పేపర్ బండిల్ తీసుకుంటారు. రేపు కాలేజీకి వచ్చేవరకు కూడా పేపర్ బండిల్ లేవన్న విషయం ధర్మరాజుకి తెలియొద్దని రిషి అంటాడు. దాంతో వసుధార తన బ్యాగ్ లో వేస్ట్ పేపర్ ఉన్న బండిల్ తీసి రిషికి చూపిస్తూ.. ఎందుకైనా పనికొస్తాయని బ్యాగ్ లో తెచ్చానని వసుధార అంటుంది. అది విని నువ్వు గొప్ప తెలివైన దానివని రిషి అంటాడు. వట్టి బండిల్ అక్కడ పెట్టి, నిజమైన పేపర్ బండిల్ ను తీసుకెళ్తారు ఇద్దరు.

ఆ తర్వాత ఉదయం పేపర్ వాల్యుయేషన్ స్పాట్ తనిఖీలు అంటూ ధర్మరాజు కొంత మంది ఆఫీసర్ లను తీసుకొని కాలేజీ కి వస్తాడు. మీ కాలేజీలో వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని సమాచారం వచ్చింది.. అందుకే తనిఖీ చెయ్యడానికి వచ్చామని మహేంద్రతో అంటాడు ధర్మరాజు. సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసేసరికి అన్ని బండిల్ కరెక్ట్ గా ఉంటాయి. "అన్ని కరెక్ట్ ఎలా ఉంటాయి.. మూడు బండిల్స్ నేను తీసుకెళ్ళాను కదా" అని ధర్మరాజు అనుకొని.. బండిల్స్ ఓపెన్ చేసి చూసి అన్ని కరెక్ట్ ఉండడంతో షాక్ అవుతాడు ధర్మరాజు. ఇక వచ్చిన ఆఫీసర్ లు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తరువాత రిషిని ఒక డౌట్ అడుగుతుంది. "సర్ ధర్మరాజే.. ఈ పని చేసాడని మీకెలా తెలుసు" అని వసుధార అడుగుతుంది. జగతి మేడం రూం 'కీ' సబ్బు వాసన వస్తుందని అంది కదా.. అంతకముందు ధర్మరాజు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు కూడా సబ్బు వాసన వచ్చింది అని రిషి అంటాడు

ధర్మరాజు వెళ్లిపోతుండగా రిషి ఆపి.. ఈ బండిల్ నువ్వు తీసుకెళ్ళావని నాకు తెలుసు.. అవి నీ దగ్గర నుండి మేము రాత్రి దొంగతనం చేసాం.. మంచి గౌరవప్రదమైన లెక్చరర్ వృత్తిలో ఉంటూ ఇలా చెయ్యడం కరెక్టేనా, ఇప్పుడు మీపై కేసు పెట్టి శిక్ష పడేలా చెయ్యొచ్చు కాని నేను అలా చెయ్యను మీకంటూ ఒక స్థాయి ఉంది.. దాన్ని పాడుచెయ్యలేను. ఇంకెప్పుడు ఇలా చెయ్యకండని ధర్మరాజు తో రిషి చెప్తాడు. ధర్మరాజు తప్పు చేసాననే పశ్చాపంతో.. "ఈ జాబ్ కి రాజీనామా చేస్తున్నా" అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషికి అందరూ కంగ్రాట్స్ చెప్తారు. ఇదంతా జరగడానికి మీరు కూడా కష్టపడ్డారు.. మీ అందరికి థాంక్స్ అని రిషి అంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.